శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లపై విషయం కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో శ్యామలరావు.. ఈ రోజు డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకి 1500కి పరిమితం చేశాం అన్నారు.. శ్రీవాణి దర్శన టికెట్ల జారికి శాశ్వతప్రాతిపాదికన కౌంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఫించన్ల పంపిణీపై స్పందించిన సీఎం చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు.. 1వ తేదీనే ఇంటి వద్ద రూ. 2737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పింఛన్ల పంపిణీ ఎంతో సంతృప్తినిచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 97.54 శాతం పింఛన్లు అందించాం. వృద్దులు, దివ్యాంగులు, ఇతర లబ్దిదారుల ఆర్థిక భద్రత మా బాధ్యత. పెరిగిన పింఛను ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు…
మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది.. ఆయన్ని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఎందుకుంటే.. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు పోలీసులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్నారు వంశీ.. మరోవైపు.. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ఉధృతి పేరుగుతోన్న నేపథ్యంలో.. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. డ్యామ్‌కు ఇన్ ఫ్లో రూపంలో 4,82,401 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 10 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి కోసం మొత్తంగా 5,28,977 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు..
మేం ఎక్కువగా అప్పులు చేశాం.. తీర్చలేక వెళ్ళిపోతున్నాం.. మా కోసం వెతక వద్దు అంటూ.. దంపతులు అదృశ్యమయ్యారు.. గోదావరి నదిలో దూకి చనిపోతున్నాం అని సూసైడ్ లెటర్ రాసి మరి భార్యా భర్తలు అదృశ్యమయ్యారు... పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి.. వాళ్లకు మేం ఊరు వెళ్ళామని చెప్పండి.. లేకపోతే వాళ్లు ఏడుస్తారు అంటూ ఆ లెటర్ లో రాశారు ఆ దంపతులు.
నంద్యాల జిల్లాలో విషాదం నెలకొంది. చాగలమర్రి మండలం చిన్నవంగలిలో ఇల్లు కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఆ కుటుంబం గాఢ నిద్రలో ఉన్న సమయంలో.. అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు మృతి చెందారు.
కీలకమైన సీఆర్డీఏ సమావేశానికి సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు.. ఈ రోజు సాయంత్రం సీఆర్డీఏ అధికారులతో సమావేశం కానున్నారు.. ఈ భేటీలో కొన్ని పాలసీ డెసిషన్స్ తీసుకునే ఛావ్స్ కన్పిస్తోంది. గతంలో రాజధానిలో వివిధ సంస్థల కార్యాలయాల ఏర్పాట్ల కోసం స్థలాలు ఇచ్చారు. సుమారు 130కు పైగా సంస్థలకు భూములిచ్చారు. వీటిల్లో కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి.
రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో కీలక అడుగులు పడబోతున్నాయి. ఆగిపోయిన నిర్మాణాలను తిరిగి ప్రారంభించడానికి అవసరమైన చర్యలకు ప్రభుత్వం ఇప్పటికే శ్రీకారం చుట్టగా.. ఇవాళ ఆ దిశగా కొన్ని కీలక అడుగులు పడుతున్నాయి. రాజధానిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు రాష్ట్రానికి రానున్నారు.