Andhra Pradesh: భారీ వర్షాలు.. సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు..
- భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు..
- ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చు..
- పెన్షన్ పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావద్దు..
- టార్గెట్లు పెట్టవద్దని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఒకరోజు ముందుగానే పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్ చెబుతూ.. తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీని చేపట్టింది ప్రభుత్వం.. ఇంటి వద్దుకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అధికారులు.. అయితే, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారు ఉద్యోగులు.. ఇక, భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. భారీ వర్షాలున్న ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చు అన్నారు సీఎం.. పెన్షన్ పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావద్దని.. టార్గెట్లు పెట్టవద్దని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. అయితే, వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
Read Also: Farmers Protest 200 Days: నేడు శంభు సరిహద్దులో రైతుల భారీ నిరసన.. పాల్గొన్న వినేష్ ఫోగట్
Also Read
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
- YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
మరోవైపు.. పెన్షన్ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది.. ఇప్పటికే 50 శాతానికి పైగా పెన్షన్లను అందజేశారు సచివాలయాల సిబ్బంది. తెల్లవారుజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షమ్ల పంపిణీ ప్రారంభం అయ్యింది.. మొత్తం 64,61,485 పెన్షన్ లబ్ధిదారులకు రూ. 2729.86 కోట్లను పంపిణీ చేయనుంది కూటమి సర్కార్.. ఇప్పటి వరకు 56 శాతం మేర పెన్షన్ల పంపిణీ చేపట్టారు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది. పెన్షన్ల పంపిణీలో టాప్-3లో శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం జిల్లాలు నిలవగా.. చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది.. జోరు వర్షంలోనూ ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ చేపడుతున్నారు సచివాలయాల సిబ్బంది. రేపు ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ జరుగుతోంది. అయితే, వర్షాల నేపథ్యంలో.. సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించారు సీఎం చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
-
Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
-
Ind Vs SL: ఊహించని రీతిలో రెచ్చిపోయిన శ్రీలంక బ్యాటర్స్.. చేతులెత్తేసిన టీమిండియా ఆటగాళ్లు..
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్‌నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!