CM Revanth Reddy : జిల్లాల కుదింపు లేదు.. మూసీ ప్రాజెక్ట్ ఆగేది లేదు
- 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు.. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’పై సీఎం స్పష్టం
- డిలిమిటేషన్‌లో దక్షిణాదికి అన్యాయం వద్దు.. ప్రస్తుత నిష్పత్తే కొనసాగాలి
- జిల్లాల కుదింపు లేదు.. కులగణన సామాజిక న్యాయానికి పునాది
- మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఆగదు.. కేసీఆర్ కుటుంబంపై రేవంత్ ఘాటు విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ రాజకీయ భవిష్యత్తు , జాతీయ స్థాయి ఎన్నికల విధానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో, 2029లో దేశవ్యాప్తంగా జరిగే సాధారణ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల విభజన, రాష్ట్రాల వాటాపై ఆయన తన గళాన్ని వినిపించారు.
రాబోయే డిలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియపై రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. జనాభా ప్రాతిపదికన ఎంపీ స్థానాలను పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య ఉన్న ఎంపీ స్థానాల నిష్పత్తి ప్రకారమే భవిష్యత్తులోనూ విభజన జరగాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలను శిక్షించేలా కాకుండా, ప్రస్తుతం ఉన్న నిష్పత్తిని కాపాడుతూనే నియోజకవర్గాల పెంపు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను తగ్గించే ఆలోచన గానీ, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రతిపాదన గానీ ప్రస్తుతానికి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పరిపాలనను ప్రజలకు చేరువ చేయడమే తమ ప్రాధాన్యతని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే సామాజిక న్యాయం దిశగా ఒక కీలక అడుగు అని, ఇది భవిష్యత్తులో సమగ్ర అభివృద్ధికి పునాది వేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. “ఎవరు సహకరించినా, సహకరించకపోయినా మేము మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం” అని ధీమా వ్యక్తం చేశారు. అజహరుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి ఆమోదం పొందకపోవడంపై స్పందిస్తూ, ఆ ప్రశ్నకు గవర్నర్ దగ్గరే సమాధానం ఉందని వ్యాఖ్యానించారు. అలాగే, అన్ని కులాలు తనను సొంత మనిషిగా భావిస్తున్నాయని, కేవలం శర్మలు మాత్రమే ఇంకా తనను ఓన్ చేసుకోలేదని చమత్కరించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలపై రేవంత్ రెడ్డి సూటిగా స్పందించారు. “అధికారం ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబం కలిసి ఉంది.. అధికారం కోల్పోగానే విడిపోయారు” అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. “మన ఇంట్లో ఉన్న ఆడపిల్లను మనం గౌరవంగా చూసుకుంటే, బయట వారు మన గురించి మాట్లాడే అవకాశం ఉండదు. ఇంట్లో సమస్యను వాళ్లే పరిష్కరించుకోలేనప్పుడు బయట వ్యక్తులు ఎందుకు వస్తారు?” అని ప్రశ్నించారు. తనకు వయసు తక్కువైనా, ఈ రాజకీయ పరిణామాలు తనకు ఎంతో అనుభవాన్ని ఇచ్చాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!