Heavy Rainfall In Andhra Pradesh: మరో 3 రోజులు భారీ వర్షాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం..
- ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు..
- మరో మూడు రోజుల కూడా భారీ వర్షలు..
- అప్రమత్తమైన ప్రభుత్వం..
- సీఎస్.. డీజీపీ.. మంత్రులు.. జిల్లా కలెక్టర్లు.. ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్..
- ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకుని వర్షాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rainfall In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి.. మరో మూడు రోజుల కూడా భారీ వర్షలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలు ప్రభుత్వం అప్రమత్తం అయ్యాంది.. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా వర్షాలపై పరిస్థితిని సమీక్షించారు సీఎం చంద్రబాబు.. ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకుని వర్షాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.. అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని.. పూర్తి అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క అధికారి పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు..
Read Also: Women’s Waist : పెళ్లి తర్వాత ఆడవాళ్ల నడుము ఎందుకు పెరుగుతుందో తెలుసా ?
Also Read
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
- Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అధికారులకు కీలక సూచనలు ఇస్తూనే.. ఆదేశాలు జారీ చేశారు..
* భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయి అప్రమత్తతో ఉంటే ప్రజల ఇబ్బందులను తగ్గించవచ్చు
* ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
* పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై భారీ స్థాయిలో నీరు చేరి ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోంది. వీటిపై దృష్టిపెట్టాలి. ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి ఇబ్బందులు లేకుండా చూడాలి.
* వర్షాలు, వరదల కారణంగా తాగునీరు, ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
* అల్లూరి జిల్లాలో కలుషిత ఆహారం ఘటన జరిగింది. వీటిపై అధికారులు సీరియస్ గా దృష్టిపెట్టాలి. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలి.
* కలుషిత ఆహారం ఘటనలకు గల కారణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
* సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థవంతంగా పనిచేయాలి..
* ఏజెన్సీలలో జ్వరాలు బారిన పడిన గిరిజనులకు వైద్యం అందేలా చూడాలి.
* ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దు.
* వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా వివిధ శాఖల అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుకుని సమన్వయంతో పనిచేయాలి.
* క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో డ్రోన్లు వంటి టెక్నాలజీని విరివిగా వాడాలి.
* డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై సమాచారం ఇవ్వాలి.
* భారీ వర్షాలు, వరదలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు అలెర్ట్ మెసేజ్ లు పంపాలి.
* విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం తమకు ఆదుకుంటుంది అనే నమ్మకం వారికి కల్పించేలా అధికారుల, ప్రజా ప్రజాప్రతినిధుల స్పందన ఉండాలి.
* ఇరిగేషన్ ప్రాజెక్టులలో నీటి నిల్వలను నిరంతరం మానిటర్ చేయాలి.
* సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధులు విడుదలకు ఆదేశాలు.
* ప్రాజెక్టుల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం.. అధికారులు బాధ్యతగా ఉండాలి.
* పింఛన్ల పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు ఇచ్చాం.
* రేపు సెలవు కాబట్టి ముందు రోజే పింఛన్లు ఇవ్వాలని చూశాం. భారీ వర్షాల కారణంగా పింఛన్ల పంపిణీకి సమయం పెంచాం.
* వచ్చే రెండు మూడు రోజుల్లో సచివాలయ ఉద్యోగులు పింఛన్ల పంపిణీ పూర్తి చెయ్యవచ్చు.
* వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది.
* విజయవాడలో కొండచరియలు విరిగి ఇంటిపై పడిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం.
* ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రకటన..
తాజావార్తలు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!