Union Minister Shivraj Chouhan: గతంలో ఎన్నడూ చవి చూడనంత జల ప్రళయాన్ని విజయవాడ చవి చూసిందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే తర్వాత.. ప్రత్యక్షగా పరిశీలించిన ఆయన.. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు.. రాష్ట్రంలో వరద పరిస్థితిపై చర్చించారు.. ఏపీలో వరద పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించారు చంద్రబాబు.. ఈ సమావేశంలో మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, ఎంపీ పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు.. ఇక, వరదలపై ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ చవి చూడనంత జల ప్రళయాన్ని విజయవాడ చవి చూసిందన్నారు.. కృష్ణా నది, బుడమేరు పొంగింది. సీఎం చంద్రబాబు కలెక్టరేట్‌నే సెక్రటేరియేట్ చేసుకున్నారు. చంద్రబాబు అండ్ టీం 24 గంటలు పని చేసిందని ప్రశంసించారు..
Read Also: Mercedes-Maybach EQS 680: ఒక్క ఛార్జింగ్‌తో 600 కి.మీ ప్రయాణం.. అదిరిపోయిన ఫీచర్లు
ఇక, ఏపీకి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్.. ఇంతటి జల ప్రళయం సంభవించినా మృతులు సంఖ్యని తగ్గించగలిగారు. ఐఏఎస్ అధికారులకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించడం దేశంలోనే తొలిసారని అని అభినందించారు.. వరద సాయంపై బాధితులు సంతృప్తితో ఉన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు.. ప్రకాశం బ్యారేజ్ 70 ఏళ్ల పురాతనమైంది. మరింత వరద వచ్చినా తట్టుకునేలా ప్రకాశం బ్యారేజీని పటిష్టపరుస్తాం అన్నారు.. ప్రకాశం బ్యారేజీ పటిష్టతపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చిస్తాం. ప్రకాశం బ్యారేజీ పటిష్టతపై నిపుణులతో చర్చిస్తాం అన్నారు. మరోవైపు.. బుడమేరు సమీపంలో అక్రమ మైనింగ్ జరపడం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయని తెలిసింది. పెద్ద ఎత్తున పంటలు నష్టపోయాయి. కేంద్ర బృందాలు వరద నష్టంపై అంచనాలు వేస్తాయి. గత ప్రభుత్వం ఫసల్ బీమా యోజనా పథకాన్ని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. వరద నష్టం అంచనాపై క్లారిటీ రాగానే కేంద్రం నుంచి సాయం అందిస్తామని వెల్లడించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్..