Gudlavalleru Engineering College Incident: ఏపీలో తొలిసారిగా CERT సేవలు.. గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై తేల్చేసిన పోలీసులు..
- గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారం పోలీసుల క్లారిటీ..
- విద్యార్థినుల హాస్టల్ వాష్ రూమ్‌లో హిడెన్ కెమెరాల ఆరోపణలు..
- ఏపీలో తొలిసారి సీఈఆర్‌టీ సేవల వినియోగం..
- ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మీడియా సమావేశం..
- ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని స్పష్టం చేసిన ఐజీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudlavalleru Engineering College Incident: కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారం పెద్ద రచ్చ చేసింది.. విద్యార్థినుల హాస్టల్ వాష్ రూమ్‌లో హిడెన్ కెమెరాల ఆరోపణలు వచ్చాయి.. దీనిపై కాలేజీలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు విద్యార్థులు.. అయితే, ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. తొలిసారి సీఈఆర్‌టీ సేవలను ఉపయోగించి.. కొంత క్లారిటీకి వచ్చారు.. పోలీసు బృందాల దర్యాప్తు అప్డేట్స్ పై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.. కళాశాలలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని ఆయన స్పష్టం చేశారు.. క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) సేవలు వినియోగించాం. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేశాం.. కళాశాల వ్యవహారంపై ముగ్గురు ఐజీలు దర్యాప్తు చేశారు.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా పోలీసుల విచారణ జరిగిందన్నారు..
Read Also: Lucknow: కదులుతున్న అంబులెన్స్‌లో మహిళపై అత్యాచార యత్నం..
Also Read
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
హాస్టల్ వాష్ రూమ్‌ల్లో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు వచ్చిన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశాం. విద్యార్థులు, స్త్రీ శిశు సంక్షేమ, పోలీసు బృందాల సమక్షంలో… ఆరోపణలు వచ్చిన వెంటనే హాస్టల్ వాష్ రూమ్‌ల్లో తనిఖీలు చేశాం అన్నారు ఐజీ అశోక్ కుమార్.. వాష్ రూమ్‌లు, షవర్లలో ఎటువంటి కెమెరాలు గుర్తించలేదని స్పష్టం చేశారు. విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ నేరుగా విచారించాం.. విచారణలో కెమెరాలు కానీ, ఆరోపిస్తున్న వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరు చెప్పలేదన్నారు.. కెమెరాల ఏర్పాటు, వీడియోలు అంశం ఎవరో చెబితేనే తమకు తెలిసిందని విచారణలో అందరూ చెప్పారని వెల్లడించారు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు..
Read Also: SBI Donations: సీఎం సహాయనిధికి ఎస్‌బీఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం విరాళం
ఇక, ఏపీలో క్రిమినల్ కేసుల్లో తొలిసారిగా CERT సేవలు వినియోగించాం.. వారు అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు ఐజీ అశోక్ కుమార్.. తాము స్వాధీనం చేసుకున్న 14 ఫోన్లు, 6 ల్యాప్ ట్యాప్‌లు, ఒక ట్యాబ్ ను CERT బృంద సభ్యులకు అప్పగించాం. విద్యార్థులు, తల్లి దండ్రులు విద్యార్థి సంఘాలు వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేశాం. విద్యార్థులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు.. నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు లభ్యం కాలేదు.. ఢిల్లీ సంస్థ CERT టెక్నికల్ విచారణ జరుగుతుంది.. మరో మూడు రోజుల్లో ఆ నివేదిక కూడా వస్తుంది. ఈ ఘటనపై ఏటువంటి ఆధారాలున్న పోలీసుల దృష్టికి తేవచ్చు.. కళాశాల యజమానియానికి విద్యార్థుల భద్రతపై పలు సూచనలు చేశామని తెలిపారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!