AP and Telangana: వర్షాలు, వరదలతో భారీ నష్టాన్ని చవి చూసిన తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించినట్టు వార్తలు గుప్పుమన్నాయి.. వరద సాయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్ల నిధులు విడుదల చేసినట్టు ప్రచారం జరిగింది.. అయితే, ఈ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.. కేంద్రం సాయం చేసింది అనే వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రూ.3300 కోట్లు వచ్చాయన్నది పుకారు మాత్రమే.. మాకైతే ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదు అన్నారు.. మేం ఇంకా ప్రాథమిక నివేదిక పంపలేదు, రేపు ఉదయం నష్టం అంచనా పై ప్రాథమిక నివేదిక పంపుతాం అన్నారు సీఎం చంద్రబాబు..
Read Also: West Bengal: అపరాజిత బిల్లును రాష్ట్రపతికి పంపించిన గవర్నర్ బోస్