Bhuma Akhila Priya: నాకూ రెడ్ బుక్ ఉంది.. ఎవ్వరినీ వదలను..! భూమా అఖిల ప్రియ సంచలనం..
- భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు..
- నాకు కూడా రెడ్ బుక్ ఉంది.. అందులో 100 మంది పేర్లు ఉన్నాయి..
- ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదు...
- ఖచ్చితమైన ఆధారాలతో వారిపై చట్టపరమైన చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuma Akhila Priya: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంత కాలం నుంచి రెడ్‌బుక్‌పై తీవ్ర చర్చ సాగుతోంది.. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్‌లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనే ఆందోళన కూడా నెలకొంది.. మరోవైపు.. నాకూ ఒక రెడ్‌బుక్ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆమె.. నాకు కూడా రెడ్ బుక్ ఉంది.. అందులో 100 మందికిపైగా ఉన్నారు.. ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు.. అంటే వారిని నేను ఏదో కట్టె పట్టుకొని కొడతానని కాదు.. చంపేస్తానని కాదు.. ఖచ్చితమైన ఆధారాలతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమందిపై తప్పుడు కేసులు బనాయించారు.. అలాంటి వరికి ఇప్పుడు ఇబ్బందులు తప్పవన్నారు.. నేను ఎవ్వరినీ ఇబ్బంది పెట్టను అని చెప్పానా? అధికారంలోకి వస్తే.. తోలు తీస్తానని చెప్పాను.. అతే తరహాలో ఉంటానన్నారు.
Read Also: Karnataka: తల్లి ఫిర్యాదును నిరాకరించిన పోలీసులు.. తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టిన కొడుకు
Also Read
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
ఇక, ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెబుతాను అని చెప్పా.. చెప్పి తీరుతా అన్నారు అఖిలప్రియ.. నాకు రెడ్ బుక్ ఉంది.. అందులో వంద మంది పేర్లు ఉన్నాయి.. ఇద్దరు ముగ్గురు పేర్లను పాపం అని తీసేశాను.. కానీ, వంద మందిని నేను ఇబ్బంది పెట్టబోతున్నాను అని వ్యాఖ్యానించారు.. అయితే, తప్పు చేస్తేనే భయపడంది.. లేకపోతే హ్యాపీ ఉండండి అని పేర్కొన్నారు.. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే గంగుల డిగ్రీ కాలేజీ తెచ్చానని చెప్పుకుంటున్నాడు.. పేరుకే డిగ్రీ కాలేజ్.. కానీ, సరైన వసతులు కూడా లేవు అని దుయ్యబట్టారు అఖిల ప్రియ.. కనీసం స్వీపర్లు కూడా లేక విద్యార్థులతో గదులు శుభ్రం చేయిస్తున్నారని విమర్శించారు.. మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్ర రెడ్డికి కేవలం దొంగ ఓటర్ మాత్రమే అని ఆరోపించారు.. సస్పెండ్ అయిన ప్రిన్సిపాల్ ని తీసుకొచ్చి డిగ్రీ కాలేజీకి వేయించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు భూమా అఖిలప్రియ..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు