Vijayawada Floods: అసలే భారీ వర్షాలు.. వరదలతో సతమతం అవుతున్న బెజవాడ వాసులకు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది.. అసలే వరదలతో సర్వం కోల్పోయి.. కట్టుబట్టలతో రోడ్లపైకి వచ్చిన పరిస్థితి ఉండగా.. మరోవైపు.. అందినకాడికి దండుకునే పనిలో పడిపోయారట దొంగలు.. మొత్తంగా బెజవాడలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. బుడమేరు వరద నీటిలో చిక్కుకుని సర్వం కోల్పోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బెజవాడవాసులు. మరోపక్క దొంగలతో భయంతో వణుకుపోతున్నాం అంటున్నారు.. అర్ధరాత్రి దొంగతనానికి వచ్చి కత్తులతో బెదిరిస్తున్నారు.. ఉన్నకాడికి దోచుకుంటున్నారు.. ముఖ్యంగా వన్ టౌన్ పరిధిలో పలు ఘటనలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, దొంగలు బారి నుండి మమ్మల్ని పోలీసులే రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. ముత్యాలంపాడు.. శ్రీనగర్ కాలనీలో మూడు బైకులు చోరీకి గురైనట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాలనీవాసులు. దొంగలు బారి నుండి మమ్మల్ని కాపాడాలంటూ వేడుకుంటున్నారు.. వరద ప్రాంతాల్లో దొంగలపై పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టాలి అంటున్నారు బెజవాడ వాసులు..
ఇక, బుడమేరుకు మరోసారి వరద పెరిగింది.. 5384 క్యూసెక్కుల నుంచి.. 8994 క్యూసెక్కుల వరకూ పెరిగింది.. ఇవాళ మధ్యాహ్నానికి 3449 క్యూసెక్కులకు తగ్గిపోయింది.. అయితే… పెరిగినపుడు వచ్చిన వరద మళ్లీ సింగ్ నగర్ లోని వచ్చింది.. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు… ఒక్కసారిగా మామూలు స్ధితికి వచ్చిన ప్రాతాలను సైతం వరద ముంచెత్తింది.. బుడమేరు గండ్లను పూడ్చండి.. మాకు రక్షణ కల్పించండి అని విజ్ఞప్తి చేస్తున్నారు బెజవాడ వాసులు..