Union Minister Ram Mohan Naidu: ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతే బెజవాడ వరద సహాయంపై కేంద్రం నిర్ణయం..
- ఇంటర్ మినిస్టీరియల్ సర్వే రిపోర్ట్ రాగానే బెజవాడ వరదల సహాయంపై నిర్ణయం..
- రిపోర్ట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Ram Mohan Naidu: ఇంటర్ మినిస్టీరియల్ సర్వే రిపోర్ట్ తర్వాతే బెజవాడ వరదల సహాయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వరదల ముంపుపై మాజీ సీఎం జగన్మోహ న్ రెడ్డి చేసిన విమర్శలపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి సహకరించాల్సిన సమయంలో అసబద్ధమైన విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రజలు జగన్ ను చూస్తే భయపడే పరిస్ధితులు వచ్చాయన్నారు రామ్మోహన్ నాయుడు. విశాఖ ఎయిర్ పోర్టులో డీజీ యాత్ర సేవలను ప్రారంభించిన ఆయన.. ఈ యాప్ ద్వారా విమాన ప్రయాణీకుల వ్యక్తిగత సమాచారానికి వచ్చిన ఇబ్బంది ఏమీ వుండదని, తమదే పూర్తి బాధ్యత అని చెప్పారు..
Read Also: Haryana: హర్యానా బీజేపీలో అలకలు.. టికెట్ల నిరాకరణతో నేతల కంటతడి
Also Read
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ఇక, అక్టోబర్ 27వ తేదీ నుంచి విశాఖపట్నం నుంచి నాలుగు కొత్త విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. వీటిలో విశాఖ-విజయవాడ మధ్య ఒకటి వుండనుంది. ఇక, రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం వచ్చిన అభ్యర్థలను, ఫీజబులిటీ రిపోర్ట్, భూమి లభ్యత ఆధారంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే దేశంలో సీప్లేన్స్ ప్రవేశ పెడతామని వెల్లడించారు కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టం అంచనా వేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ ఏర్పాటు చేసినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించిన విషయం విదితమే.. తెలంగాణలో 26 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, 2 వైమానికదళ హెలికాప్టర్లు.. ఏపీలో 26 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు 8 వైమానికదళ హెలికాప్టర్లు, 3 నౌకాదళ హెలికాప్టర్లు.. వరద సహాయక చర్యలో పాల్గొంటున్నాయని కేంద్ర హోంశాఖ..
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!