RC17 Update: బిగ్ సర్‌ప్రైజ్.. ఈసారి అంతకుమించి, రెండు భాగాలుగా..!
- రామ్ చరణ్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్
- సుకుమార్‌తో మళ్లీ జతకట్టేందుకు సిద్ధమవుతున్న చరణ్
- పుష్ప స్థాయిలో బడ్జెట్, స్కేల్ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan, Sukumar’s RC17 Big Update: ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్. చాలా కాలం తర్వాత దర్శకుడు సుకుమార్‌తో చరణ్ మళ్లీ జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు. ‘RC17’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ భారీ యాక్షన్ డ్రామాగా ఉండనుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘పుష్ప’ స్థాయిలో బడ్జెట్, స్కేల్‌తో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. కథ అండ్ ట్రీట్‌మెంట్ పూర్తిగా కొత్తగా, ఇప్పటివరకు చూడని విధంగా ఉండబోతోందట. సుకుమార్ మార్క్ డీటైలింగ్, ఇంటెన్స్ యాక్షన్, ఎమోషనల్ డెప్త్ ఈ సినిమాలో మరో స్థాయిలో ఉంటుందని అంటున్నారు. ‘రంగస్థలం’ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ తెరపైకి రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలైన తర్వాతే RC17 షూటింగ్ ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది జూన్ నెల నుంచి షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌కు లాంగ్ షెడ్యూల్ ప్లానింగ్ జరుగుతోందని టాక్.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్‌గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
Also Read: Vitamins Rich Foods: విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఇవే.. ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం!
ఇక ఈ చిత్రానికి సంగీతం ఎవరు అందిస్తారన్న దానిపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏఆర్ రెహమాన్ లేదా దేవి శ్రీ ప్రసాద్ (DSP)లో ఎవరో ఒకరు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి RC17 సినిమాతో చరణ్-సుకుమార్ కాంబినేషన్ మరోసారి టాలీవుడ్‌ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ‘పుష్ప’ తర్వాత సుకుమార్ తీసే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా అంచనాలు పెరుగుతున్నాయి. అధికారిక అనౌన్స్‌మెంట్ వస్తే.. ఈ హైప్ ఇంకో స్థాయికి చేరడం ఖాయం.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!