వర్షాలు, వరదలతో భారీ నష్టాన్ని చవి చూసిన తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించినట్టు వార్తలు గుప్పుమన్నాయి.. వరద సాయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్ల నిధులు విడుదల చేసినట్టు ప్రచారం జరిగింది.. అయితే, ఈ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.. కేంద్రం సాయం చేసింది అనే వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు.. నాకు కూడా రెడ్ బుక్ ఉంది.. అందులో 100 మందికిపైగా ఉన్నారు.. ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు.. అంటే వారిని నేను ఏదో కట్టె పట్టుకొని కొడతానని కాదు.. చంపేస్తానని కాదు.. ఖచ్చితమైన ఆధారాలతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భిన్నంగా గణపతిని అలంకరించే విధానంలోనూ డిఫరెంట్ ఆలోచనలకు పదును పెట్టారు. ఇందులో నుంచి రూపుదిద్దుకున్నదే బెల్లం గణపతి. గాజువాక బడ్ డిపో దగ్గర లంబోధర అసోసియేషన్ 70 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహం ఏర్పా టు చేసింది. సుమారు 18 టన్నుల బెల్లం ఇందు కోసం వినియోగించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. జగనే రాష్ర్టానికి ఒక పెద్ద విపత్తుగా పేర్కొన్న ఆయన.. జగన్ చేసిన మానవ తప్పిదాల వల్లనే వరదల వల్ల పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగాయన్నారు. ‘మ్యాన్ మేడ్ డిజాస్టర్’లో ఉన్న మ్యాన్ జగన్ రెడ్డే అని దుయ్యబట్టారు
ఆంధ్రప్రదేశ్లో మందు బాబులకు గుడ్ న్యూస్.. గత కొంత కాలంగా మద్యం షాపులు బంద్ కానున్నాయంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.. అయితే, రాష్ట్రంలో యథావిధిగానే పని చేయనున్నాయి ప్రభుత్వ మద్యం దుకాణాలు.. బంద్ ని నిరవధికంగా వాయిదా వేసింది ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ సేల్స్ మెన్స్ అండ్ సూపర్వైజర్ల అసోసియేషన్..
బుడమేరు వరద నీటిలో చిక్కుకుని సర్వం కోల్పోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బెజవాడవాసులు. మరోపక్క దొంగలతో భయంతో వణుకుపోతున్నాం అంటున్నారు.. అర్ధరాత్రి దొంగతనానికి వచ్చి కత్తులతో బెదిరిస్తున్నారు.. ఉన్నకాడికి దోచుకుంటున్నారు.. ముఖ్యంగా వన్ టౌన్ పరిధిలో పలు ఘటనలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, దొంగలు బారి నుండి మమ్మల్ని పోలీసులే రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. ముత్యాలంపాడు.. శ్రీనగర్ కాలనీలో మూడు బైకులు చోరీకి గురైనట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాలనీవాసులు. దొంగలు బారి నుండి మమ్మల్ని కాపాడాలంటూ వేడుకుంటున్నారు.. వరద ప్రాంతాల్లో…
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు గుంటూరు పోలీసులు.. అయితే, విచారణలో షాకింగ్ విషాలు వెలుగు చూశాయి.. డబ్బులు అప్పు తీసుకుని, అడిగితే ఆ మహిళల ముఠా హత్యలు చేస్తున్నట్టు గుర్తించారు..
మరో మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతుంది వాతావరణ శాఖ.. పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న అల్పపీడన ప్రాంతం ఈరోజు మధ్య బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం మీద ఉంది. దాని అనుబంధ ఉపరితల అవర్తనము సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంగి ఉన్నది. ఇది దాదాపు ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతూ సెప్టెంబరు 9 నాటికి వాయువ్య బంగాళాఖాతం మరియు…