బుడమేరు కొల్లేరులోకి ప్రవహించడంతో చుట్టు పక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. ఏలూరు నుండి కైకలూరు వచ్చే రహదారి మీదగా నీరు ప్రవహించడంతో ముందస్తుగా వాహనాలను నిలిపివేశారు పోలీసులు.. ఈ రాత్రికి కొల్లేరు వరద నీరు పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు.. ఇప్పటికే కొన్ని గ్రామాలు నీట మునిగాయి.. కొల్లేరులోకి వరద రెండు అడుగుల మేర పెరిగితే భారీ నష్టం జరిగే అవకాశం ఉందంటున్నారు.
బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగుతుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బుడమేరు వాగు ఆధునికీకరణ కోసం పనులు ప్రారంభిస్తే.. 2019లో క్యాన్సిల్ చేశారని గుర్తుచేసుకున్నారు సీఎం చంద్రబాబు.. 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునేలా ప్రకాశం బ్యారేజీని మరింత పటిష్టపరచాలని వెల్లడించారు.
గతంలో ఎన్నడూ చవి చూడనంత జల ప్రళయాన్ని విజయవాడ చవి చూసిందన్నారు.. కృష్ణా నది, బుడమేరు పొంగింది. సీఎం చంద్రబాబు కలెక్టరేట్నే సెక్రటేరియేట్ చేసుకున్నారు. చంద్రబాబు అండ్ టీం 24 గంటలు పని చేసిందని ప్రశంసించారు.. ఏపీకి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్.. ఇంతటి జల ప్రళయం సంభవించినా మృతులు సంఖ్యని తగ్గించగలిగారు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్..
కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారం సీఈఆర్టీ సేవలను ఉపయోగించి విచారణ చేసి.. కొంత క్లారిటీకి వచ్చారు.. పోలీసు బృందాల దర్యాప్తు అప్డేట్స్ పై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.. కళాశాలలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని ఆయన స్పష్టం చేశారు.. క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) సేవలు వినియోగించాం. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేశాం..…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్నారు.. ఫీవర్ తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అయితే, అస్వస్థతతో ఉన్నప్పటికీ తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు
ఈ రోజు బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు సీఎం చంద్రబాబు. ఉదయం కలెక్టరేట్ లో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సీఎంను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. వారి నుంచి విరాళాలు తీసుకున్న అనంతరం సిఎం ఎనికేపాడు వెళ్లారు. అక్కడ నుంచి పొలాల మీదుగా ప్రయాణించి రైవస్ కాలువ, ఏలూరు కాలువ దాటి వెళ్లి బుడమేరు మంపు ప్రాంతాన్ని పరిశీలించారు. ఏలూరు కాలువపై పంటుపై ప్రయాణించి అవతలి గట్టుకు చేరుకుని ముంపు ప్రభావంపై పరిశీలన జరిపారు.