ఇవాళ ఆహార పంపిణీ సక్రమంగా జరిగింది.. ఫుడ్ కొద్దిగా వృధా అయినా ఫర్వాలేదని చెప్పి ఉదారంగా పంపిస్తున్నాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మంచినీళ్లు.. పాలు, బిస్కెట్లు.. కొవ్వొత్తులు.. అగ్గిపెట్టెలు కూడా పంపిస్తున్నాం. బియ్యం.. ఉల్లిపాయలు, చక్కెర, ఆయిల్ కూడా అందిస్తున్నాం.. ఎక్కడైనా బియ్యం, ఇతర వస్తువులు దొరకకుండా చేస్తే చొక్కా పట్టుకుని అడగండి అని సూచించారు.
విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలు సృష్టించిన నష్టంపై ప్రాథమిక అంచనా వేసిన ప్రభుత్వం.. కేంద్రానికి నివేదిక పంపింది.. వరద విపత్తు వల్ల రాష్ట్రానికి రూ.6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది.. ఈ మేర కేంద్రానికి పంపేందుకు ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం..
కృష్ణా జిల్లా బుడమేరులో ఓ కారు కొట్టుకుపోయింది.. కేసరపల్లి ఉప్పులూరు రహదారిలో బుడమేరు కాలువలో ఈ ఘటన చోటు చేసుకుంది.. హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వెళ్తున్న ఓ వ్యక్తి.. కారుతో సహా కొట్టుకుపోయినట్టుగా అనుమానిస్తున్నారు..
విజయవాడలో వరదలు మిగిల్చిన నష్టంపై అంచనా వేసేందుకు సిద్ధం అవుతోంది ప్రభుత్వం.. సోమవారం నుంచి మూడు రోజుల పాటు వరద నష్టం అంచనా వేస్తామని తెలిపారు ఏపీ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా.. అయితే, ఈ సమయంలో బాధితులు ఇళ్లలో ఉంటే పూర్తిస్థాయి వివరాల నమోదుకు అవకాశం ఉంటుందన్నారు..
నా ప్రాణం పోయినా ఈ ఇల్లు విడిపెట్టేది లేదంటున్నారు దువ్వాడ వాణి.. ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేస్తున్నారు వాణి, కుమార్తె హైందవి.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వాణి.. కేసు కోర్టులో ఉంది.. మాకు ఆర్డర్ కూడా వచ్చింది.. ఇంటిలో ప్రవేశానికి కోర్టు అనుమతి ఇచ్చిందన్నారు.. కోర్టు ఆదేశాలు ఉండగా.. మాధురి చేసుకున్న రిజిస్ట్రేషన్ చెల్లదు అంటున్నారు.. ఇది కోర్టు ధిక్కారం కిందకి వస్తుందంటున్నారు.. ఇక, మా ఆస్తి తీసుకొని, రకరకాల ఇల్లీగల్ పనులు చేస్తుంది అంటూ…
విజయవాడ సహా ఏపీలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు.. వరదలు అతలాకుతలం చేశాయి.. ఇక, కృష్ణానది చరిత్రలో కనీవినీ ఎరుగని వరద కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. మరోవైపు.. ఆపన్న హస్తం అందించేందుకు దాతల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది.
వివాదాస్పదంగా మారిన ఆ ప్రాపర్టీ నాదే అంటూ ఓ వీడియో విడుదల చేశారు దివ్వెల మాధురి.. ఈ బిల్డింగ్ నా పేరు మీద ఉంది.. నా ఇంటిలోకి ఎవరూ రావడానికి వీలులేదని స్పష్టం చేశారు.. అంతేకాదు.. దువ్వాడ శ్రీనివాస్‌తో ఏమైనా ఇష్యూ ఉంటే వాణి బైట తేల్చుకోవాలంటూ సలహా ఇచ్చారు.
నందికొట్కూరులో మహిళ హత్య కేసులో సంచల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. నంద్యాల జిల్లాలో బిహారీ యువకుడు, మరొకరితో కలసి ఓ సస్పెక్ట్ షీట్లో ఉన్న మహిళను తుపాకీతో కాల్చి , నరికి చంపిన ఘటన సంచలనం సృష్టిస్తుండగా.. ఈ కేసులో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి..