CM Chandrababu: పోలీసు ఉన్నతాధికారులతో సీఎం కీలక సమీక్ష.. ఆ కేసుల్లో దర్యాప్తుపై ఆరా..
- పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఇప్పటి వరకు దర్యాప్తుల్లో ఉన్న కేసుల పురోగతిపై కీలక సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కీల కేసులపై దర్యాప్తు చేపట్టింది.. అయితే, ఆ దర్యాప్తులో ఇప్పటి వరకు సాధించిన పురోగతి ఏంటి? అంటూ ఆరా తీశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇవాళ పోలీసు శాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి డీజీపీ సీఎస్ సహా వివిధ దర్యాప్తు సంస్థల అధినేతలతో సమీక్ష నిర్వహించారు సీఎం.. ఈ సమీక్షలో హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, విజిలెన్స్ చీఫ్ హరీష్ కుమార్ గుప్త పాల్గొన్నారు..
Read Also: Supreme Court: బుల్డోజర్ చర్యపై అస్సాంకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసు జారీ
Also Read
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
ఇక, మద్యం, గనులు, ఫైబర్ నెట్, భూ కబ్జాలు, మదనపల్లె ఫైల్స్ వంటి వాటిల్లో దర్యాప్తు పురోగతిపై చర్చించారు సీఎం చంద్రబాబు.. ఇప్పటికే ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేశామని సీఐడీ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. మరోవైపు.. మద్యం, ఫైబర్ నెట్ భూ కబ్జాల కేసుల్లో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు సీఎం చంద్రబాబు. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అవినీతి వ్యవహారంపై విచారణపై సమీక్షలో ప్రస్తావించారు.. మదనపల్లెలో తగులబడిన ఫైళ్లు ఘటన దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించారు.. దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.. మరోవైపు.. దర్యాప్తు సంస్థల అధినేతలతో సీఎం చంద్రబాబు సమావేశం కొనసాగుతోంది..
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?