Tomato Price: వంటిల్లో టమోటాకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.. ఏ కూర వండినా సరే.. అటు ఉల్లి.. ఇటు టమోటా ఉండాల్సింది.. అయితే, గత కొంత అమోటా ధర భారీ పడిపోవడంతో రైతులు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.. బహిరంగ మార్కెట్‌లోనే రూ.10-రూ.20కే కిలో టమోటా అమ్ముడుపోవడంతో.. ఇక, హోల్‌సెల్ మార్కెట్‌లో కనీసం గిట్టుబాటు ధర కూడా అందక రైతులు అప్పులపాలయ్యారు.. అయితే, ఇప్పుడు కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో రోజురోజుకీ టమోటా ధర పెరుగుతోంది.. కిలో టమోటా రూ. 40 నుంచి 50 రూపాయలు పలుకుతుంది.. జత బాక్స్ 2000 నుండి 2500 పలుకుతుండడంతో మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతుల ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు.. ఇక, టమోటా ధర మంచి ధర పలుకుటుండడంతో అప్పుల బారి నుండి బయట పడుతున్నామని టమోటా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Muppavarapu Venkaiah Naidu: మాతృ భాషను మర్చిపోయిన వాడు మనిషి కాదు.. నేను తెలుగులోనే మాట్లాడతా..
మరోవైపు.. వారం పది రోజుల నుండి టమోటా ధర పైపైకి ఎగబాకుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. టమోటో సెంచరీ కొట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు.. దిగుబడి తక్కువ ఉండడమే టమోటా ధర పెరగటానికి కారణమని వ్యాపారస్తులు భావిస్తున్నారు. మరొక నెల ఇదే రేటు ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. కాగా, పత్తికొండ మార్కెట్ టమోటాకు ఫేమస్.. ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర ప్రాంతాలకు కూడా టమోటాను ఎగుమతి చేస్తుంటారు..