Tirupati Laddu Controversy: సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది.. విచారణ సందర్భంగా ప్రభుత్వ తరుఫు న్యాయవాదికి పలు ప్రశ్నలు సంధించింది.. ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? నెయ్యి రిపోర్ట్‌పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని ప్రశ్నించింది.. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి.. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని ఆదేశించింది. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్ ల్యాబ్‌కు పంపారా? ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదో చెప్పాలని అడిగింది.. ఇక, లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షలకు పంపలేదు.. మైసూర్, ఘజియాబాద్ ల్యాబ్‌ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియర్ తీసుకోలేదని ప్రశ్నించింది సుప్రీంకోర్టు..
Read Also: SWAG Theatrical Trailer: నాలుగు తరాలను ఒక్క సినిమాలో చూపించడం.. హీరో విష్ణుకే సొంతం
మరోవైపు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. వెంకటేశ్వర స్వామి భక్తులకు ఇవి ఆందోళన కలిగించే అంశాలు. ప్రజల మధ్య ప్రసాదంలోని పదార్థాలు కలుషితమయ్యాయని ప్రకటన చేశారు.. ఆరోపణల అనంతరం టీటీడీ అధికారి స్వయంగా కల్తీ నెయ్యి వాడలేదని చెప్పారు.. సీఎం చేసిన ప్రకటన వివాదాస్పదమైంది.. దేవుడి ప్రసాదం ప్రశ్నార్థకంగా ఉంటే దానిని పరిశీలించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.. స్వచ్ఛమైన అనుమతించదగిన పదార్థాలు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించగలవని నిర్ధారించడానికి ఒక ప్రక్రియ ఉంది. ముఖ్యమంత్రి ఆ ప్రకటనను కొట్టిపారేశారని.. కల్తీ నెయ్యి 100 శాతం వాడలేదని టీటీడీ అధికారి చెబుతున్నారని పేర్కొన్నారు.. శాంప్లింగ్ జరిగిందా? తిరస్కరించబడిన నమూనాల నుండి నమూనా తీసుకోబడిందా? ఏ సరఫరాదారు ఆందోళన చెందారు? తప్పుడు నివేదికకు అవకాశం ఉందా? అన్న అంశాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరారు..
Read Also: Ravindra Jadeja: టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్న జడ్డూ భాయ్..
ఇక, ప్రసాద కల్తీ పై రాజకీయ జోక్యాన్ని అనుమతించాలా? బహిరంగ ప్రకటన ఏ ప్రాతిపదికన చేశారనే దానిపై మేం ఆందోళన చెందుతున్నామని సుబ్రమణ్యస్వామి తరపున లాయర్ వాదించారు.. మరోవైపు.. తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ. ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం… కలుషిత నెయ్యి ఉపయోగించినట్లయితే, అది ఆమోదయోగ్యం కాదు. బాధ్యులెవరో దర్యాప్తు జరగాలి.. వాస్తవాలు తెలియాలంటే విచారణ జరగాలని కోరారు.. అయితే, ఈ విషయంలో ప్రజల ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏంటి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.. ఇక్కడ ఏం కనిపించడం లేదన్న కోర్టు.. వాల్యూలో మార్పులకు కారణాలుగా ల్యాబ్ లు కొన్ని అంశాలు ఉన్నాయి.. కేంద్రం విచారణలో జోక్యం చేసుకుంటుందా..? సీట్ సరిపోతుందా..? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.. ఇరువైపులా వాదనలు రికార్డు చేసిన సుప్రీంకోర్టు.. ప్రపంచంలో ఉన్న భక్తులందరి మనోభావాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని వ్యాఖ్యానించింది.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ఈ విచారణకు సరిపోతుందా..? లేదా స్వతంత్ర దర్యాప్తు ఏదైనా అవసరమా? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అడిగింది సుప్రీంకోర్టు.. ఇక, తిరుమల లడ్డూ వివాదంపై విచారణ వచ్చే గురువారానికి వాయిదా పడింది.. తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీరికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం..