ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్న కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమెతుడైన ఆ శ్రీనివాసునీ కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగితేలారు. స్వామివారి వివాహ మహోత్సవానికి ఆలయ తూర్పు రాజగోపురం ముందర అనివేటి మండపంలో ప్రత్యేక కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా స్వామి, అమ్మవార్లను వేర్వేరు వాహనాల్లో కళ్యాణ మండపానికి తీసుకువెళ్లారు.
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను వివాదాలు చుట్టుకుంటున్నాయా..? అంటే అవును అన్నట్టుగానే ఉంది పరిస్థితి.. మొన్న నంద్యాలలో విజయ డైరీ చైర్మన్ తో వివాదం, నిన్న విజయ డైరీ చైర్మన్ రియాక్షన్, ఇవాళ భూమా అఖిల సోదరుడు భూమా విఖ్యాత హాట్ కామెంట్స్, మరో వైపు టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో ఎంట్రీతో ఆళ్లగడ్డలో హైటెన్షన్ మొదలైంది..
ఈ రోజు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. ఉదయం 11.30 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోన్న ఆయన.. సాయంత్రం 5 గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే గడపనున్నారు.. ఈ రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఎంపీలు కూడా పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై చర్చించనున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా చర్చలు జరగనున్నట్టుగా తెలుస్తోంది..
శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారం కేసు సంచలనం సృష్టించింది.. వలస వచ్చిన ఓ ఫ్యామిలీపై దాడి చేసిన దుండగులు.. అర్ధరాత్రి సమయంలో అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేపు చేసిన ఘటన కలకలం సృష్టించగా.. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి.. ఘటన జరిగిన 48 గంటల్లోగా నిందితులను అరెస్ట్ చేశారు.. ఈ కేసుపై మీడియాతో మాట్లాడిన ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. సత్యసాయి జిల్లాల్లో అత్తా కోడళ్లపై అత్యాచారం చేసిన ఘటనలో 48…
దీపావళి పండుగను ఏ తేదీన జరుపుకోవాలనే విషయంపై పంచాంగ కర్తల మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి. దీపావళి అక్టోబర్ 31వ తేదీన కాదు.. నవంబర్ 1న జరుపుకోవాలని కోనసీమ ధృక్ సిద్ధాంత పంచాంగ కర్తలు గణన చేస్తుండగా.. లేదు లేదు.. అక్టోబర్ 31వ తేదీనే జరుపుకోవాలని రేలంగి తంగిరాల పంచాంగ కర్తలు పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను నియమించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కూటమి సర్కార్.. అయితే, పలువురు మంత్రులను రెండేసి జిల్లాలకు ఇంఛార్జ్గా నియమించారు..
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం ఏనుగుల గుంపు హల్చల్ చేసింది.. అటవీప్రాంతం నుంచి పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఏనుగులు గుంపు విధ్వంసం సృష్టించాయి.. దేవళంపేట, అయ్యావాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డి పల్లెలో ఏనుగుల గుంపు పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి.. వరి పంటను తొక్కి నాశనం చేశాయి ఏనుగులు.. ఇక, ఏనుగుల దాడిలో ఓ రైతు మృతి చెందాడు..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ పాలసీల రూపకల్పనపై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వివిధ పాలసీలపై వరుసగా రెండో రోజున సీఎం చంద్రబాబు సమీక్షలు జరపనున్నారు.