Students Hair Cuts: ఆంధ్రలో అమానవీయ ఘటన.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరింపు..
- ఏపీలో అమానవీయ ఘటన..
- కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థునుల జుట్టు కత్తిరింపు..
- జి. మాడుగుల KGBV జూనియర్ కాలేజీ హాస్టల్ లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Students Hair Cuts: ఆంధ్రప్రదేశ్‌లో ఓ అమానవీయ ఘటన వెలుగు చూసింది.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థునుల జుట్టు కత్తిరించారు.. ఈ ఘటన అల్లూరి సీతారామ రాజు జిల్లాలో చోటు చేసుకుంది.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించడం విమర్శలకు దారితీసింది. జి. మాడుగుల KGBV జూనియర్ కాలేజ్ హాస్టల్ లో ఈ నెల 15న ఈ ఘటన జరిగింది. ఉదయం ప్రతిజ్ఞకు హాజరుకాలేదన్న కారణంతో ప్రత్యేక అధికారిణి విద్యార్థినుల జుత్తును కొద్దికొద్దిగా కత్తిరించగా.. తల్లి దండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కార్తిక పౌర్ణమి రోజు స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నీరు అందుబాటులో లేదు. దీంతో, బైపీసీ రెండో ఏడాది విద్యార్థులు కొందరు ఉదయం ప్రతిజ్ఞకు ఆలస్యంగా హాజరయ్యారు.
Read Also: Shreyas Iyer: కెప్టెన్‌గా శ్రేయస్.. అయ్యర్ సారథ్యంలో సూర్యకుమార్!
Also Read
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Selfie Accident: సెల్ఫీ సరదా.. మూడు నిండు ప్రాణాలు బలి.!
అయితే, 23 మంది విద్యార్థినులు రాలేదని ప్రత్యేక అధికారిణి సాయిప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులను ఎండలో నిల్చో పెట్టారు. మధ్యాహ్న భోజన విరామంలో 18 మంది విద్యార్థినుల జుట్టు కత్తిరించారు. అయితే, విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పడం.. వాళ్లు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది.. మరోవైపు.. జుట్టు విరబోసుకుని తిరుగుతున్నందుకు శిక్ష విధించినట్టు చెప్పుకొచ్చారట ప్రత్యేక అధికారిణి.. అయితే, ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదం కావడంతో.. విద్యాశాఖ విచారణ చేపట్టింది. కాగా, సరైన వసతులు కల్పించకుండా.. ఆలస్యం అయ్యిందంటూ విద్యార్థినుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్న అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు.. విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి..
తాజావార్తలు
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!