ఏపీలో పల్లె పండుగ కార్యక్రమం ప్రారంభంమైంది.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ప్రజాప్రతినిధులు ఇలా అంతా ఆ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు.. ఇక, కంకిపాడులో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల చేశారు.. ఇక, పనులు పూర్తి చేయడానికి డెడ్లైన్ పెట్టారు పవన్ కల్యాణ్.. సంక్రాంతి నాటికి అన్ని పనులు పూర్తి చేసి.. జనవరి 25న మరికొన్ని పనులు ప్రారంబిద్ధామని సూచించారు.
వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్దతపై సమీక్షించారు.. రాష్ట్రంలో ఈ సీజన్ లో 676 ఎంఎం సరాసరి వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 734 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది.. 18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, 8 జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కవ వర్షపాతం నమోదు అయినట్టు వెల్లడించారు..
ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది.. మొత్తం 3396 దుకాణాల్లో ఇప్పటివరకు దాదాపు 1500 షాపుల కేటాయింపు పూర్తి అయ్యింది.. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 86 దుకాణాల కేటాయింపు పూర్తి కాగా.. కర్నూలు జిల్లాలో మందకోడిగా లాటరీ.. కేవలం 19 షాపులకే లాటరీ పూర్తి చేశారు.. మిగతా మద్యం దుకాణాల కోసం 26 జిల్లాల్లో లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి.. ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి.. ఈ అల్పపీడనం తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదులే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది..
అవుకు మండలం సింగనపల్లెలో మద్యం మత్తులో ఓ వ్యక్తి నిద్రలోకి జారుకున్నాడు.. అది ఎంతలా అంటే.. కిక్కులో నిద్రపోతున్న అతడిపైకి కొండ చిలువ వచ్చి చేరినా సడిసప్పుడు లేదు.. పీకలదాకా తాగి చలనం లేకుండా మత్తులోకి వెళ్లిపోయాడు ఓ లారీ డ్రైవర్.. అయితే, మత్తులో ఉన్న మందు బాబుపై ఒళ్లంతా అటూ ఇటూ పాకి చూడసాగింది కొండచిలువ.
నంద్యాల జిల్లాలో సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణం తీసింది.. మహానంది క్షేత్రం సమీపంలోని తెలుగు గంగ కాల్వ వద్ద సెల్ఫీ దిగడానికి వెళ్లిన సుర గౌతమ్ అనే యువకుడు ప్రమాదవశాత్తు తెలుగుగంగలో పడి గల్లంతయ్యాడు.. గాజులపల్లె ఆర్.ఎస్. సమీపంలో గౌతమ్ మృతదేహన్ని గుర్తించారు స్థానికులు.
అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం.. ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.. ఇవాళ్టి నుంచి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహిస్తారు.. రాష్ట్ర వ్యాప్తంగా 13,324 గ్రామాల్లో ఒకేసారి పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభంకానున్నాయి.. కంకిపాడులో జరిగే పల్లె పండుగ వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు.. పల్లె పండుగలో భాగంగా దాదాపు రూ.4,500 కోట్ల వ్యయంతో 30 వేల పనులను చేపట్టనుంది ప్రభుత్వం.. 3 వేల కిలో మీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలో…
ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడిన ఆవర్తనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.