ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీకానుంది.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు..
గుంటూరు జిల్లాకు చెందిన మహేష్, కృష్ణా జిల్లాకు చెందిన శైలు.. హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు.. అక్కడ ప్రారంభమైన వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది.. ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి పెద్దలకు కనపడకుండా వెళ్లిపోయారు.. దీంతో.. యువతి సైలు కుటుంబ సభ్యులు నందిగం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రేమజంట.. తమ ప్రేమకు పెద్దలు అడ్డుగా వస్తారని భావించి, భయపడి ఈ తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డినట్టుగా తెలుస్తోంది.
ప్రజాప్రతినిధులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని స్పష్టం చేసిన ఆయన.. మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే.. వైసీపీకి మనకి తేడా లేదనుకుంటారని తెలిపారు.. అయితే, చిన్న ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుంది.. అలాగే ఎన్డీఏలో ఉన్న ఏ కార్యకర్త తప్పు చేసినా.. ఎవరినైనా తిట్టినా.. సీఎంతో పాటు ప్రభుత్వంపై కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుందని హెచ్చరించారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరిగింది.. దీంతో.. శ్రీశైలం జలాశయం గేటును ఎత్తారు అధికారులు.. ఈ సంవత్సరంలో ఇది ఐదోవసారి రేడియల్ క్రెస్టు గేట్ ఎత్తడం విశేషంగా చెప్పుకోవాలి.. జలాశయం 1 రేడియల్ క్రెస్టు గేటు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో రూపంలో 93,270 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలం డ్యామ్‌లో చేరుతుండగా.. 1 గేటు 10 అడుగుల మేర ఎత్తి 95,626 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు తెలంగాణ నుంచి వచ్చిన నలుగురు ఐఏఎస్ అధికారులు.. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లిన ఐఏఎస్‌లు రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాకాటి అరుణ, వాణి ప్రసాద్.. ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్త లిక్కర్ షాపులు ప్రారంభం అయినా.. మద్యం దుకాణాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు 99 రూపాయల క్వార్టర్ బాటిల్.. ఏపీ ప్రభుత్వం క్వార్టర్ రూ.99కి అందిస్తామని చెప్పిన నేపథ్యంలో డిపోలకు చేరాయి షాట్ విస్కీ, ఓల్డ్ క్లబ్ బ్రాందీ.. కానీ, డిపోల నుంచి ఇంకా అత్యధిక షాపులకు రూ.99 క్వార్టర్ బాటిల్స్ చేరలేదు.. కొన్నింటికి మాత్రమే రూ.99 క్వార్టర్ బాటిల్స్ చేరాయి..
కర్నూలు జిల్లాను మరోసారి యురేనియం భయం పట్టుకుంది. గతంలో ఆళ్లగడ్డ ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం ప్రయత్నించగా.. స్థానికుల ఆందోళనతో పనులు నిలిపేశారు. తాజాగా, కప్పట్రాళ్లలో యురేనియం నిక్షేపాలు నిర్ధారణ కోసం తవ్వకాలకు అనుమతి లభించిందన్న సమాచారంతో స్థానికుల్లో మళ్లీ ఆందోళన వ్యక్తమవుతోంది. యురేనియం నిక్షేపాల నిర్ధారణ కోసం 68 బోర్ల తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇచ్చినట్టు సమాచారం.
రాయలసీమ యూనివర్సిటీలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం సృష్టించింది.. యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ చర్చగా మారింది.. ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థి సునీల్ పై సీనియర్లు దాడి చేశారు. పరిచయ వేదిక పేరుతో హాస్టల్ లోకి ప్రవేశించిన సీనియర్లు.. సునీల్‌పై దాడి చేశారట.. అయితే, సీనియర్ల బారినుంచి తప్పించుకునే ప్రయత్నంలో హాస్ట్‌ల్ వదిలి.. కాలేజీలో గ్రౌండ్ లో పరుగులు పెట్టాడు సునీల్..