విజయవాడలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది.. మాచవరం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ భవానీ... విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ విధులు నిర్వహిస్తోంది.. అయితే, నిన్న రాత్రి నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. రెండు రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది కేంద్రం.. అందులో ఆంధ్రప్రదేశ్‌కు 498 కోట్ల రూపాయలు కేటాయించగా.. తెలంగాణకి 516 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది.
హైదరాబాద్‌లో వరుస క్రైమ్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి.. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది.. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు.. గచ్చిబౌలిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. అర్ధరాత్రి సమయంలో ఆటో వెళ్తున్న యువతిపై కన్నేసిన కామాంధులు.. ఆటోలోనే ఆమెపై అత్యాచారాకి ఒడిగట్టారు.
మహిళలకు ఉచిత బస్సు పథకంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కీలక ప్రకటన చేశారు. దీపావళికి ఉచిత సిలిండర్ అమలు చేస్తామని, ఆ మరుసటి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అందుబాటులోకి వస్తుందన్నారు. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాటు పడుతున్నారని.. పేదల కోసం రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహాలు, మరిన్ని పెన్షన్లు ఇస్తామని చెప్పారు గురజాల జగన్ మోహన్..
ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు అధికారులు.. నేడు సిరిమానోత్సవం జరగనున్న నేపథ్యంలో.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.. పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు భక్తులు.. మరోవైపు.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా క్యూలైన్లో టెంట్లు ఏర్పాటు చేశారు.. భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు.. హుక్కుం పేటలో సిరిమానుకు పసుపు కుంకాలు సమర్పించుకుంటున్నారు భక్తులు..
ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాల గడువు ముగిసింది. ఐదేళ్లుగా ప్రభుత్వం నడుపుతున్న మద్యం దుకాణాలకు నేడే చివరి వర్కింగ్ డే. ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త మద్యంపాలసీలో భాగంగా.. ప్రైవేట్ వ్యక్తులకు లిక్కర్ షాపులను ఇచ్చే విధంగా టెండర్లను ఆహ్వానించింది 26 జిల్లాల నుంచి 3396 షాపులకి 89,882 దరఖాస్తులు వచ్చాయి.
మరో తుపాను గండం పొంచివుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. నేడు మరింత బలపడి, తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఇది తుఫాన్‌గా మారి.. ఎల్లుండి తీరం దాటుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో.. ఏపీలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్ సిసోడియా పర్యవేక్షణ చేశారు.. భారీ వర్షాల నేపధ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు..