AP Assembly: టిడ్కో ఇళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. అసెంబ్లీ సోమవారానికి వాయిదా
- అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా..
- టిడ్కో ఇళ్ల అంశంపై సభలో మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- టిడ్కో ఇళ్ల లోన్లు ఒక నెల వాయిదా వేయాలని బ్యాంకులకు లేఖ రాశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి.. అయితే, టిడ్కో ఇళ్ల అంశంపై సభలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.. టిడ్కో ఇళ్ల లోన్లు ఒక నెల వాయిదా వేయాలని బ్యాంకులకు లేఖ రాశామని తెలిపారు.. హడ్కో నుంచీ రుణం ప్రభుత్వమే తీసుకుని టిడ్కో రుణాలు తీరుస్తాం అని వెల్లడించారు. లబ్ధిదారులను మార్చేయడం, డీడీలు కట్టించుకుని బ్యాంకులో వేయలేదు అన్నదానిపై దర్యాప్తు జరిపిస్తారని స్పష్టం చేశారు.. పూర్తయిన ఇళ్లకు ముందుగా సౌకర్యాలు ఇస్తాం అన్నారు.. 2018-19 లో నిర్ణయించిన లబ్ధిదారులను గుర్తించి వారికి ఇళ్లు కేటాయిస్తాం అని వెల్లడించారు మంత్రి నారాయణ.
Read Also: Nabha Natesh : చక్కగా చీరకట్టి చిక్కటి అందాలను చూపిస్తోన్న నభా నటేశ్
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
ఇక, అసెంబ్లీలో కీలక తీర్మానం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. 2024-25 సంవత్సరానికి ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధుల కేటాయంపుపై అసెంబ్లీలో నోట్ ఆన్ డిమాండ్స్ ప్రవేశపెట్టారు మంత్రి నిమ్మల రామానాయుడు.. భారీ, మధ్య తరహా ప్రాజెక్ట్ లకు 15,513 కోట్ల రూపాయలు కేటాయింపు కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు నిమ్మల.. అలాగే చిన్న నీటి తరహా ప్రాజెక్టులకు 1,227 కోట్ల రూపాయల నిధులు కేటాయంపు కోరుతూ మరో తీర్మానం ప్రవేశపెట్టారు.. ఇక, టిడ్కో ఇళ్ళ నిర్మాణాలపై శాసన సభలో చర్చ కొనసాగుతోంది.. మరోవైపు.. జలవనరులు శాఖ మంత్రి రామానాయుడుతో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భేటీ అయ్యారు.. రాయచోటి నియోజకవర్గ నీటి సమస్యలపై చర్చించారు.. శ్రీనివాసపురం, అడవిపల్లె రిజర్వాయర్ బ్యాలెన్స్ పనులు పూర్తికి 156 కోట్లు మంజూరు చేయాలని కోరారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. కాగా, ఈ రోజు శాసన సభ సమావేశాలు ప్రారంభం కాగానే సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.. ఏపీ శాసనసభ మాజీ సభ్యులు కెంబూరి రామ్మోహనరావు, పాలపర్తి డేవిడ్ రాజు, రుద్రరాజు సత్యనారాయణ రాజు, అడుసుమిల్లి జయప్రకాష్, శ్రీమతి మాగుంట పార్వతమ్మ మరియు శ్రీ రెడ్డి సత్యనారాయణ మరియు మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాప తీర్మానం పెట్టారు.. మృతులకు సంతాపంగా రెండు నిముషాల మౌనం పాటించింది శాసన సభ..
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!