ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను పునఃప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతిలోని లింగాయపాలెం దగ్గర సీఆర్డీఏ బిల్డింగ్ మిగిలిన పనులను పునఃప్రారంభించారు సీఎం చంద్రబాబు.. దీంతో.. రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టినట్టు అయ్యింది.
విశాఖపట్నం మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.. లాసన్స్‌బే కాలనీలోని ఎంవీవీ ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలో కూడా ఏక కాలంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
అమరావతి రాజధాని నిర్మాణం మరో మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తామని ప్రకటించారు.. ఇక, సీఆర్డీఏ బిల్డింగ్ అప్పటి మా ప్రభుత్వంలోనే పూర్తి అయ్యిందన్నారు.. ఇంకా, మిగిలి ఉన్న పనులను పూర్తి చేయడానికే ఈ పునః ప్రారంభం అన్నారు మంత్రి పొంగూరు నారాయణ
చాప కింద నీరుల తిరుపతి రూరల్ ప్రాంతంలో గంజాయి సేవించిన యువత.. మత్తులో స్థానికులపై వరుసగా దాడులకు పాల్పడితున్నారు.. ఈ వరుస ఘటనలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.. ఓటేరు, తిరుచానూరు సమీపంలో అలా వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్దానికులు..
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఏలూరు ప్రభుత్వాసుపత్రి మార్చురిలో ఉన్న ఓ అనాధ మృత దేహాన్ని ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి సమయంలో మాయం చేసేందుకు మార్చురీ అసిస్టెంట్ ప్రయత్నించాడు. ఆ విషయాన్ని గమనించిన మహిళా ఉద్యోగి.. అతన్ని అడ్డుకోవడంతో మృతదేహం తరలింపు నిలిచిపోయింది. అనాధ మృతదేహాన్ని మెడికల్ కాలేజీలకు అమ్మడానికి తీసుకువెళుతున్నారు అంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో విషయాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది గోప్యంగా ఉంచారు.
ఏపీ సీఆర్దీయే ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించడం ద్వారా రాజధాని పనులను మొదలు పెట్టనుంది ప్రభుత్వం.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆ పనులను ప్రారంభించనున్నారు చంద్రబాబు.. అయితే, 160 కోట్ల రూపాయలతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను చేపట్టింది సీఆర్డీఏ.. కానీ, ఆ తర్వాత ఆ పనులు నిలిచిపోయాయి..
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది చేతిలో బాలిక బలైంది. తనను ప్రేమించాలంటూ గత కొంత కాలంగా ఓ బాలిక వెంట పడుతోన్న యువకుడు.. ఎవరూ లేని సమయం చూసుకొని ఆ ఇంట్లోకి చొరబడ్డాడు.. ప్రేమించాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో.. బలవంతంగా ఆమె నోట్లు పురుగుల మందు పోసి పరారయ్యాడు..
ఈ రోజు జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్న టీటీడీ.. మరోవైపు.. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి (ఈ నెల 21వ తేదీ) ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుంది.. ఇక, ఎల్లుండి (21వ తేదీ) మధ్యాహ్నం లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయించనుంది టీటీడీ.