జమిలి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ సాగుతోంది.. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ నినాదంతో నరేంద్ర మోడీ సర్కార్ ముందుకు వెళ్తోంది.. జమిలి ఎన్నికలే వస్తే.. 2027లోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయనే చర్చ సాగుతోంది.. అయితే, ఈ తరుణంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. జమిలి ఎన్నికలు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు మాత్రం 2029లోనే ఉంటాయన్నారు.. పార్లమెంట్, అసెంబ్లీలకు కేంద్రం జమిలి ఎన్నికలు పెట్టినా.. అవి షెడ్యూల్ ప్రకారం 2029లోనే వస్తాయని.. ముందుగా రాబోవని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు..
మహారాష్ట్రలో ట్రెండ్ సెట్ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం..
మహారాష్ట్ర ఎన్నికల్లో తిరుగులేని విజయానికి అందుకునేవైపు సాగుతోంది బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి.. ఇప్పటి వరకు 220కి పైగా స్థానాల్లో బీజేపీ-ఏక్‌నాథ్‌షిండే-అజిత్‌పవార్ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది.. అయితే, మహావికాస్ అగాడి కూటమి మాత్రం చతికిలపడిపోయింది.. కేవలం 50కి పైగా స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్, శరద్‌పవార్-శివసేన కూటమి అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు.. మరోవైపు.. మహారాష్ట్ర ఎన్నికల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చక్రం తిప్పాడనే చెప్పాలి.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం నిర్వహించిన సంగతి విదితమే.. బహిరంగ సభల్లో.. రోడ్‌షోలలో పాల్గొన్నారు పవన్.. అయితే, పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లోనూ బీజేపీ కూటమి అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు.. బల్లార్‌పూర్, పుణె, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహించారు పవన్ కల్యాణ్.. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.. కాగా, పవన్ కల్యాణ్ ప్రచారానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం విదితమే.. పవన్ ఎక్కడికి వెళ్లినా.. OG.. OG.. అంటూ.. సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు పవర్ స్టార్ ఫ్యాన్స్..
వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి మరో ఎమ్మెల్సీ గుడ్‌బై..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.. రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కీలక నేతలు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు.. ప్రజాప్రతినిధులు ఇలా చాలా మంది పార్టీకి గుడ్‌బై చెప్పారు.. ఆ తర్వాత కొందరు టీడీపీలో.. ఇంకా కొందరు జనసేనలో.. మరికొందరు బీజేపీలో చేరారు.. అయితే, వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు.. ఎమ్మెల్సీ పదవికి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారట ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ.. కైకలూరు నియోజకవర్గం నుంచి గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన జయమంగళ వెంకటరమణ.. గత ప్రభుత్వ హయాంలో.. అంటే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో.. అప్పటి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీని వీడి వైసీపీ చేరారు.. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు వైఎస్ జగన్.. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్నారు జయమంగళ వెంకటరమణ.. మరోవైపు.. గత కొంత కాలంగా జయమంగళ వైసీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.. దీనిపై ఆయన సన్నిహితులతో సమావేశాలు కూడా నిర్వహించారని.. కొందరు అభిప్రాయాలు తీసుకున్నారనే పుకార్లు కూడా వినిపించాయి.. మొత్తంగా ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకే నిర్ణయం తీసుకున్నారు.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు జయమంగళ వెంకటరమణ.. ఈ మేరకు మండలి చైర్మన్ కు రాజీనామా లేఖను పంపించారు.. అయితే, ఆయన ఏ పార్టీలో చేరతారు అనేది వేచి చూడాలి.. కానీ, తిరిగి టీడీపీలో చేరడానికే ఆయన మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది..
బీజేపీ ఒంటరిగా 125 స్థానాలు గెలవబోతుంది..
బీజేపీ ఒంటరిగా 125 స్థానాలు గెలవబోతుందని కేంద్ర మంత్రి బండిసంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో బండిసంజయ్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయదుంధుబి మోగిస్తుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని రుజువు అయ్యిందన్నారు. యూపీలో ఏడు స్థానాలలో ముందంజలో ఉందని తెలిపారు. ఎన్ని అబద్దాల ప్రచారం చేసిన ఎన్డీయే కూటమి నే మహారాష్ట్ర ప్రజలు నమ్మారన్నారు. మహారాష్ట్ర లో హిందూ సమాజం ఐకమత్యాన్ని చాటారని తెలిపారు. బటేంగే తో కటెంగే అని చాటారన్నారు. సమాజం ఐక్యంగా ఉంటే ఇలాంటి ఫలితాలు వస్తాయన్నారు. కర్ణాటక, తెలంగాణ నుండి మహారాష్ట్ర కి కాంగ్రెస్ డబ్బులు పంపిందని తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణ లో కాంగ్రెస్ వైఫల్యాలే మహారాష్ట్ర లో గెలుపు వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు. వాస్తవ విషయాలు గ్రహించారు కాబట్టే కాంగ్రెస్ కూటమి ఓటమి చెందిందని తెలిపారు. మోడీ అభివృద్ధి మంత్రం పనిచేసిందన్నారు. బూత్ కి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ మా కార్యకర్తల ముందు పనిచేయలేదన్నారు. ఇండియా కూటమి చీలీపోవడం ఖాయమని తెలిపారు. తెలంగాణ లో కూడా కాంగ్రెస్ కి ఇదే గతి పడుతుందన్నారు. మహారాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీ మోసాలని మేము ప్రచారం చేసామన్నారు. ఇప్పటికైనా తెలంగాణలో ఇచ్చిన హామీ నెరవెర్చండి..లేదంటే మహారాష్ట్ర లో పట్టిన గతే పడుతుందని పేర్కొన్నారు.
మహారాష్ట్ర సీఎం ఎవరు..? ఏక్‌నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ సత్తా చాటింది. రాష్ట్రంలో ఘన విజయం దిశగా వెళ్తోంది. మహాయుతిలోని బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీలు భారీ విజాయాన్ని అందుకున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కూటమి 220కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 125 సీట్లలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఇదిలా ఉంటే, తాజాగా బీజేపీ కూటమి విజయం ఖరారవుతున్న సందర్భంలో మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకే పదవి లభిస్తుందా..? లేదా దేవేంద్ర ఫడ్నవీస్‌కి సీఎం పదవి వస్తుందా.? అనే ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి పదవిపై ప్రస్తుత సీఎం షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకే సీఎం సీటు ఇవ్వాలనే రూలేం లేదు. అంతిమ ఫలితాలు రానివ్వండి.. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినట్లే, మూడు పార్టీల నేతలు సమావేశమై నిర్ణయం తీసుకుంటాం. మా అగ్రనేతలు మోడీ, అమిత్ షాలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పారు. మేం చేసిన అభివృద్ధిని చూసి మా కూటమికి పట్టం కట్టారని షిండే అన్నారు. ఒక వైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధిని చేశామని అన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్: బీజేపీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి సంచలనం సృష్టించింది. ట్రెండ్స్ ప్రకారం బీజేపీ కూటమి 210కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఎవరు దక్కించుకుంటారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. తాజాగా, దీనిపై బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్ హాట్ కామెంట్స్ చేశారు. ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీయే సీఎం పీఠాన్ని దక్కించుకుంటుందని చెప్పుకొచ్చారు. బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి.. మాకు దాదాపు 125 సీట్లు రాబోతున్నాయి.. ఇక, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని కమలం పార్టీ నేత ప్రవీణ్ దారేకర్ చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఒంటరిగా 110 సీట్ల పైగా కైవసం చేసుకోవడంతో.. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిపై వాదన బలంగా వినిపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో కమలం అధినేతే సీఎంగా కూర్చునే అవకాశం ఉంది. కాగా, ఏక్ నాథ్ షిండే వర్గం నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతుంది. సీఎం పదవిని వదులుకునే ప్రసక్తే లేదన్న షిండే వర్గం తేల్చి చెప్పింది. దీంతో ముంబైలో ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ కీలక సమావేశం ఏర్పాటు చేయగా.. పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. రాష్ట్ర సీఎం పదవిని ఫడ్నవీస్ చేపట్టాలని బీజేపీ నేతల డిమాండ్ చేస్తున్నారు.
ఇది ప్రజా తీర్పు కాదు.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలుస్తున్నారు..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఎర్లీ ట్రెండ్ ప్రకారం ఎన్డీయే కూటమి అత్యధిక స్థానాల్లో దూసుకుపోతుంది. మ్యాజిక్ ఫిగర్ 145 స్థానాలు దాటి.. 221 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఇందులో సింగిల్ గానే భారతీయ జనతా పార్టీ 128 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 52 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై శివసేన (యూటీబీ) నేత సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్ చేశారు. ఇది ప్రజా తీర్పు కాదు.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి మహాయుతి గెలుస్తోందని ఆరోపించారు. కాగా, ఎన్నికల ఫలితాల సరళి చూస్తుంటే ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోందని సంజయ్ రౌత్ అన్నారు. మా సీట్ల కొన్ని దోచుకున్నట్లు సమాచారం.. ఇది ప్రజల నిర్ణయం కానేకాదు అని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన తప్పేంటో అందరికీ క్లియర్ గా అర్థం అవుతోందన్నారు. ఈ ఫలితాలతో ప్రజలు కూడా ఏకీభవించలేదు.. ఏక్ నాథ్ షిండేకు 60 సీట్లు, అజిత్ పవార్‌కు 40, బీజేపీకి 125 సీట్లు రావడం అసాధ్యం అని సంజయ్ రౌత్ అన్నారు.
ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పిన జస్ప్రీత్ బుమ్రా!
టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. సేనా దేశాలపై (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అత్యధిక సార్లు అయిదు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా 5 వికెట్స్ తీసి ఈ ఘనత అందుకున్నాడు. సేనా దేశాలపై బుమ్రా ఏడు సార్లు ఫైఫర్ పడగొట్టాడు. భారత దిగ్గజం కపిల్ దేవ్ కూడా సేనా దేశాలపై ఏడు సార్లు అయిదు వికెట్లు పడగొట్టాడు. సేనా దేశాలపై జస్ప్రీత్ బుమ్రా 51 ఇన్నింగ్స్‌ల్లో ఏడు సార్లు ఫైఫర్ పడగొడితే.. కపిల్ దేవ్ 62 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. నాటింగ్‌హమ్, కేప్‌టౌన్ వేదికల్లో రెండు సార్లు.. జొహెన్నెస్‌బర్గ్, మెల్‌బోర్న్, పెర్త్‌లో ఒకసారి బుమ్రా అయిదు వికెట్లు తీశాడు. టెస్టు కెరీర్‌లో బుమ్రా ఓవరాల్‌గా ఓ ఇన్నింగ్స్ అయిదు వికెట్లు 11 సార్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాలో మూడు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్‌లో రెండుసార్లు ఈ ఘనత అందుకున్నాడు.
అభిమానులకు అలర్ట్.. మారిన వేలం సమయం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో వేలం జరగనుంది. వేలానికి మొత్తంగా 1,574 మంది ప్లేయర్స్ తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. తాజాగా మరో ముగ్గురిని జత చేసింది. వేలంలో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఈసారి టీమిండియా స్టార్స్ ఉండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే మెగా వేలం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ అలర్ట్. ఐపీఎల్ 2025 మెగా వేలం సమయంలో బీసీసీఐ స్వల్ప మార్పు చేసింది. బ్రాడ్‌కాస్టర్ల అభ్యర్థన మేరకు వేలం సమయాన్ని మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:30కు మార్చింది. ఇందుకు కారణం భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్. మ్యాచ్ జరిగే 3, 4 రోజుల్లో వేలం జరగనుంది. ప్రస్తుతం పెర్త్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఉదయం 7.50కి ఆరంభమై.. మధ్యాహ్నం 2.50కి ముగుస్తుంది. కొన్నిసార్లు లేట్ కూడా అవ్వొచ్చు. నిన్న మ్యాచ్ 3 తర్వాత ముగిసింది. ఈ సందర్భంలో వేలానికి ఇబ్బంది ఉంటుంది. టెస్ట్ మ్యాచ్, ఆక్షన్ టైమ్‌లు క్లాష్ కాకుండా.. అర్ధగంట వేలంను లేటుగా ఆరంభించనున్నారు.
రెస్టారెంట్లో 30నిమిషాలు వెయిటింగ్.. అయినా నయనతారను పట్టించుకోని జనం
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాను ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె మరో సారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాను ఈ మధ్య తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి ఢిల్లీకి వెళ్లింది. అక్కడి కాకే దా హోటల్ లో నార్త్ ఇండియన్ తందూరి టేస్ట్ చేయడానికి నయన్, విఘ్నేష్ సుమారు అరగంటపాటు వేచి చూడాల్సి వచ్చింది. నవంబర్ 18న నయన్ బర్త్ డే వేడుకలను జరుపుకునేందుకు తాము ఢిల్లీ వెళ్లినట్లు విఘ్నేష్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు. స్టార్ హీరోయిన్ అయినా నయనతార మాత్రం ఈ డిన్నర్ డేట్ కు భర్తతో కలిసి ఓ సాధారణ జంటలాగే వెళ్లింది. ఆ రెస్టారెంట్ చాలా బిజీగా ఉండటంతో టేబుల్ కోసం వీరిద్దరూ చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్కడి ఫుడ్ ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను రెస్టారెంట్ లోని వ్యక్తి ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ డిన్నర్ డేట్, వీడియోపై విఘ్నేష్ శివన్ స్పందించారు. “నవంబర్ 17న ఓ చిన్న బర్త్ డే ఈవెనింగ్ సెలబ్రేషన్స్ కోసం వెళ్లాం. ఆ క్షణాలను క్యాప్చర్ చేసిన వ్యక్తికి థ్యాంక్స్” అని అంటూ రాసుకొచ్చాడు. ఫుడ్ చాలా టేస్టీగా ఉందన్న విఘ్నేష్.. టేబుల్ కోసం 30నిమిషాల పాటు వెయిట్ చేయాల్సి వచ్చిందని చెప్పడం విశేషం.
‘ఫంకీ’గా మారబోతున్న విశ్వక్ సేన్.. ఆయన కోసమేనా ?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన నెక్స్ట్ లైనప్ సినిమాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ తో ఎక్సయిట్మెంట్ పెంచుతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్స్ డ్ టాక్ లభిస్తుండటంతో ఈ మూవీ వీకెండ్‌పై కన్నేసింది. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే, ఈ సినిమా రిలీజ్ వేళ, ఇప్పుడు విశ్వక్ నెక్స్ట్ మూవీకి సంబంధించి ఓ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. చాన్నాళ్ల కిందటే విశ్వక్ సేన్ 14వ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించనున్న ఈ కాంబినేషన్ నవ్వుల వర్షం క్రియేట్ చేయబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించనున్నారు. విశ్వక్ సేన్ ఇప్పటికే ‘లైలా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అమ్మాయి గెటప్‌లో విశ్వక్ సందడి చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా తరువాత మరో రెండు ప్రాజెక్టులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇందులో ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు అనుదీప్‌తో సినిమా ఉంది.