IPL Auction 2025 Live: ఐపీఎల్ మెగా వేలం రెండు రోజు కొనసాగనుంది. తొలి రోజు వేలంలో ఆటగాళ్లు.. కోట్లు కొల్లగొట్టగా, ఈరోజు కూడా అదే స్థాయిలో ఆటగాళ్లు అమ్ముడుపోనున్నారు. తొలిరోజు 84 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరిగింది. ఫ్రాంచైజీలు ఆదివారం మొత్తం రూ.467.95 కోట్లు ఖర్చు చేశారు. సోమవారం కూడా పెద్ద సంఖ్యలో వేలం జరుగనుంది.
స్వస్తిక్ చికారా, మాధవ్ కౌశిక్, పుఖ్‌రాజ్ మాన్ బ్రేస్ ప్రైస్‌కు అమ్ముడుపోలేదు.
శ్రీలంక స్పిన్నర్ విజయకాంత్ వియస్కాంత్, వెస్టిండీస్ ఆటగాడు అకేల్ హోసేన్, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అన్ సోల్డ్‌గా నిలిచారు.
ఆఫ్ఘన్ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ ముంబైకి ఆడనున్నాడు. అతని కోసం కేకేఆర్, ఆర్సీబీ, ముంబై పోటీ పడ్డాయి. చివరకు రూ. 4.80 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది.
అఫ్గాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్ రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో అతనిని కొనేందుకు ఆసక్తి చూపలేదు.
లాకీ ఫెర్గూసన్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 2 కోట్ల బేస్ ధరతో కొనుగోలు చేసింది. ఆర్టీఎం ద్వారా ఆర్సీబీ అతనిని తీసుకోలేదు.
ఆకాశ్ దీప్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది. బేస్ ప్రైస్ రూ.కోటి. అతని కోసం లక్నో, పంజాబ్ పోటీ పడ్డాయి. ఆర్టీఎం ద్వారా అతనిని తీసుకునేందుకు ఆర్సీబీ ఆసక్తి చూపలేదు.
దీపక్ చాహర్‌ను రూ. 9.25 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. చాహర్ కోసం చెన్నై, ముంబై మధ్య పోటీ సాగింది.
పేసర్ ముఖేష్ కుమార్ కోసం సీఎస్కే, పంజాబ్, ఢిల్లీ మధ్య వేలం జరిగింది. చివరకు ఢిల్లీ ఆర్టీఎం ద్వారా రూ. 8 కోట్లకు సొంతం చేసుకుంది.
భువనేశ్వర్ కుమార్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. చాలా సీజన్లలో హైదరాబాద్ కు ఆడిన భువనేశ్వర్ ను ఆర్టీఎం ద్వారా తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో.. బెంగళూరు రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కోసం ముంబై, లక్నో పోటీ పడ్డాయి.
గుజరాత్ సూపర్ జెయింట్స్ జెరాల్డ్ కొట్జియాను రూ. 2.40 కోట్లకు సొంతం చేసుకుంది.
తుషార్ దేశ్ పాండేను రూ. 6.50 కోట్లకు ఆర్ఆర్ కొనుగోలు చేసింది. బేస్ ప్రైస్ రూ. కోటి.. కాగా, అతని కోసం సీఎస్కే, రాజస్థాన్ పోటీ పడ్డాయి.
జోష్ ఇంగ్లిస్ ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. రూ. 2.60 కోట్లతో అతన్ని సొంతం చేసుకుంది. అతని కోసం ఎస్ఆర్హెచ్, పంజాబ్ పోటీ పడ్డాయి.
టీమిండియా ఆటగాడు కేఎస్ భరత్, ఆస్ట్రేలియా కీపర్ అలెక్స్ కారీ, డోనోవన్ ఫెరీరా అన్ సోల్డ్‌గా నిలిచారు.
సౌతాఫ్రికా బ్యాటర్ ర్యాన్ రికిల్‌టన్‌ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. రూ. 1 కోటి బేస్ ధరతో అతనిని కొనుగోలు చేసింది.
వెస్టిండీస్ బ్యాటర్ షాయ్ హోప్ అన్‌సోల్డ్‌గా ఉన్నాడు.
నితిశ్ రాణాను రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. అతని కోసం చెన్నై, బెంగళూరు, రాజస్థాన్ పోటీ పడ్డాయి. చివరకు రాజస్థాన్ రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది.
కృనాల్ పాండ్యాను రూ. 5.75 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అతని కోసం ఆర్ఆర్, ఆర్సీబీ పోటీ పడ్డాయి.
న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ అన్ సోల్డ్‌గా ఉన్నాడు. అతని బేస్ ధర రూ.2 కోట్లు. అతనిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు.
మార్కో జాన్సెన్ను పంజాబ్ కింగ్స్ రూ. 7 కోట్లకు దక్కించుకుంది. అతని కోసం ముంబై, పంజాబ్, గుజరాత్ పోటీ పడ్డాయి. చివరకు పంజాబ్ కొనుగోలు చేసింది.
భారత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను గుజరాత్ రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ శామ్ కరన్‌ను చెన్నై రూ.2.4 కోట్లకు కొనుగోలు చేసింది.
పృథ్వీ షా, శార్దూల్ ఠాకూర్లను ఎవరూ కొనుగోలు చేయలేదు. వీరి బేస్ ధర 2 కోట్లు.
దక్షిణాఫ్రికా దిగ్గజం ఫాఫ్ డు ప్లెసిస్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ బేస్ ధర రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. గత మూడు సీజన్లలో అతను ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉన్నాడు. మరోవైపు.. అజింక్య రహానె అమ్ముడుపోలేదు.
రెండవ రోజు వేలం ప్రారంభమైంది. ఈ రోజు వేలంలో మొదటి పేరు న్యూజిలాండ్ లెజెండ్ కేన్ విలియమ్సన్. విలియమ్సన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అతని బేస్ ధర 2 కోట్లు. న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్ ఫిలిప్స్ కూడా అన్ సోల్డ్‌గా నిలిచాడు.