CM Chandrababu: జమిలి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
- జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
- జమిలి ఎన్నికలు వచ్చినా ఏపీలో 2029లోనే ఎన్నికలు..
- పార్లమెంట్, అసెంబ్లీలకు కేంద్రం జమిలి ఎన్నికలు పెట్టినా..
- షెడ్యూల్ ప్రకారం 2029లోనే ఏపీ ఎన్నికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ సాగుతోంది.. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ నినాదంతో నరేంద్ర మోడీ సర్కార్ ముందుకు వెళ్తోంది.. జమిలి ఎన్నికలే వస్తే.. 2027లోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయనే చర్చ సాగుతోంది.. అయితే, ఈ తరుణంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. జమిలి ఎన్నికలు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు మాత్రం 2029లోనే ఉంటాయన్నారు.. పార్లమెంట్, అసెంబ్లీలకు కేంద్రం జమిలి ఎన్నికలు పెట్టినా.. అవి షెడ్యూల్ ప్రకారం 2029లోనే వస్తాయని.. ముందుగా రాబోవని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు..
Read Also: Nani : పవన్ కళ్యాణ్ పై న్యాచురల్ స్టార్ నాని ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
- AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
- AP Inter Exams 2027: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 2027 పరీక్షల ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ విడుదల
- Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
ఇక, విజన్-2047ను కింది స్థాయి వరకూ ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు.. మరోవైపు.. వైఎస్ జగన్ కు అదానీ 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారనే అంశంపై న్యాయ సలహా తీసుకుని స్పందిస్తాం అన్నారు.. విజన్ 2047 కోసం నిధుల సమీకరణకు వినూత్న పంథాలో ముందుకు వెళ్తామని చెప్పారు.. కాలేజీలు, విశ్వవిద్యాలయాల వంటి వేదికలపై చర్చిస్తాం. ఈ విజన్ ద్వారా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నామో అన్ని వర్గాలవారికీ తెలియడానికి ప్రణాళిక రూపొందించుకుని పనిచేయనున్నట్టు వెల్లడించారు.. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల, ప్రతి క్వార్టర్, ప్రతి ఏడాదికి లక్ష్యాలు పెట్టుకుని సాధించడానికి ప్రయత్నిస్తామన్నారు.. అయితే, సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి తన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు.. సమావేశం అనంతరం.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ప్రాజెక్టుల గురించి చర్చించాం.. ఇరిగేషన్, నదుల అనుసంధానం ప్రాజెక్టుల గురించి చర్చించామన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047ను కూడా చంద్రబాబు రిలీజ్ చేసారు.. దానిలోనూ కేంద్ర అనుసంధాన పనులున్నాయని తెలిపారు. పెట్టుబడులను తీసుకురావడంలో కేంద్రంతో అనుసంధానం చేసి పూర్తి చేయడంలో ముందుండాలని సీఎం సూచించారని పేర్కొన్నారు. అయితే, జమిలి ఎన్నికలపై మీడియా చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
-
Off The Record : ఎన్నికల కోసం బీఆర్ఎస్ EXTRA కేర్ తీసుకుంటుందా?
-
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
-
CDSCO Warning : పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త.. కిడ్నీలకు ముప్పు!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది దాటినా అదే ఘాటు, అదే రుచి! పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఇలా పెట్టేయండి..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!