దానా తుఫాన్ ఇచ్ఛాపురంపైనే అధిక ప్రభావాన్ని చూపుతుందనే అంచనాలతో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని ఉద్దానం, తీర గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత, అనుభవాల దృష్ట్యా.. దానా ఏం చేస్తుందో అనే టెన్షన్లో పడిపోయారు..
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం రాజానగర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఏసీ బస్సు.. ఇన్నోవా కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణం చేస్తున్న ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారులోని ప్రయాణికులు కర్నూల్ నుంచి తిరుపతికి రిసెప్షన్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.. గుర్లకు వెళ్లనున్న ఆయన.. డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, డయేరియా బాధితులను పరామర్శించనున్నారు. ఇక, విజయనగరం జిల్లా పర్యటనకు ఈ రోజు ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరనున్న జగన్.. ఉదయం 11 గంటల ప్రాంతంలో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్నారు..
* ఢిల్లీ: విభజన సమస్యలపై నేడు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం వాయిదా * నేడు సూర్యాపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన * హైదరాబాద్: నేడు రాష్ట్రానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ర్ట సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్.. పలు కమిటీలతో విడి విడిగా భేటీ కానున్న బన్సల్.. ఎమ్మెల్సీ ఎన్నికలు , అభ్యర్థుల పై చర్చ * ఆదిలాబాద్: నేడు జిల్లాకు బీఆర్ఎస్ […]
మంత్రులతో చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు.. మంత్రులు ప్రో యాక్టివ్ గా పని చేయలని స్పష్టం చేశారు.. మంత్రులు స్పీడ్ పెంచాలి, అదే సమయంలో సమర్ధంగా పని చేయాలంటూ మంత్రులకు క్లాస్ తీసుకున్నారు చంద్రబాబు.. ఇక నుంచి ప్రతిరోజు ముఖ్యమేనంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.. మంత్రులు కూడా తనతో సమానంగా పని చేయగలగలన్న చంద్రబాబు.. ఇంకా కొందరు నిర్లిప్తంగా ఉన్నారని.. ఇలా ఉంటే పని చేయలేరంటూ మంత్రులకు హితవు చెప్పారు.
తీరం వైపు దానా తుఫాన్ దూసుకొస్తుంది.. తూర్పుమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ‘దానా’ తుఫాన్.. రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.. ఇక, గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలో మీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్.. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది..
కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది.. చెత్తపన్ను రద్దు అమలు విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఇక, మహిళలకు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకంపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ సాగింది.. మరోవైపు.. దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్యను 15 నుండి 17 వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్.. ఇద్దరు బ్రాహ్మణులు పాలకమండలిలో ఉండాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది..
ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.99 నాణ్యమైన లిక్కర్ అమ్మకాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి.. మార్కెట్లోకి చీప్ లిక్కర్ అందుబాటులోకి వచ్చింది.. దీంతో.. మందుబాబుల్లో హుషారు మరింత పెరిగిపోయింది.. షార్ట్స్ పేరుతో బ్రాండీ, విస్కీ అమ్మకాలు ప్రారంభం అయ్యాయి.. అయితే, పూర్తిస్థాయిలో మద్యం అందుబాటులోకి వచ్చేవరకు లిమిటెడ్ స్థాయిలో అమ్మకాలు జరగనున్నాయి.. ఇప్పుడు మాత్రం.. ఒక్కో లిక్కర్ షాపుకు మూడు నుంచి 8 కేసులు మాత్రమే సరఫరా చేస్తున్నారు.
పెండింగ్ దరఖాస్తులపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. భవన నిర్మాణాలు, లే అవుట్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ, ఏపీ రేరా అనుమతులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది.. అన్ని రకాల ఫీజులు చెల్లించి, సరైన డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ఆన్లైన్లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల తక్షణ పరిష్కారానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిర్ణయం తీసుకున్నారు.. త్వరితగతిన దరఖాస్తులు పరిష్కరించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు పట్టణ ప్రణాళికా విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.. మంత్రి నారాయణ ఆదేశాలతో దరఖాస్తుల […]