Amravati: కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది.. రాజధాని 29 గ్రామాల పరిధిలో రైతులు ఇచ్చిన భూములు 34 వేల ఎకరాలు కాగా, ప్రభుత్వ భూములతో కలుపుకుని మొత్తం 58 వేల ఎకరాలున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇందులో 24వేల ఎకరాలు కంపచెట్లతో అడవిలా మారిపోయింది. దీంతో ఈ మొత్తం జంగిల్‌ను తొలగించడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం 36.50 కోట్లతో పనులు ప్రారంభించింది. ఈ కాంట్రాక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ సొంతం చేసుకుంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాలను 250 జోన్లుగా విభజించి కంపచెట్ల తొలగింపు పనులు పూర్తి చేసింది. వీటిలో వందలాది పొక్లెయినర్లతో, కార్మికులతో పనులు జరిగాయి..
Read Also: CM Chandrababu: విద్యుత్ శాఖపై సీఎం సమీక్ష
రోజూ పదుల సంఖ్యలో ఎక్స్‌కవేటర్లు, వందల సంఖ్యలో కార్మికులు, కూలీలు కంపచెట్ల తొలగింపులో పని చేసారు… రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో పనులు వేగంగా జరిగాయి. పనులు మొదలైన తరువాత రెండు మూడు రోజులు వర్షాలు పడడం, స్థలాలు బురదతో నిండిపోవడంతో కంపచెట్ల తొలగింపు కొంత మందకొడిగా సాగింది. రెండు మూడు రోజులుగా వాతావరణం పొడిగా వుండడంతో పనుల్లో వేగం పెరిగింది. అమరావతిలో కంపచెట్లు తొలగించడంతో మొత్తం ప్రాంతమంతా మైదానంలా చదునుగా కనిపిస్తోంది. చెట్ల మధ్యలో ఇప్పటి వరకూ కనిపించకుండా పోయిన హైకోర్టు భవనం ఇప్పుడు దర్శనమిస్తోంది. చెట్ల మధ్య కనిపించకుండా పోయిన సైన్‌బోర్డులు, రైతుల రిటర్నబుల్ ప్లాట్ల హద్దురాళ్లు ఇప్పుడు బయటపడుతున్నాయి.
Read Also: Arvind Kejriwal: ఎన్నికల ముందు శుభవార్త.. మరో 80,000 మందికి వృద్ధాప్య పెన్షన్
రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు తుది దశకు చేరాయి. సుమారు 24 వేల ఎకరాల్లో రూ.36 కోట్ల వ్యయంతో ఆగస్టులో చేపట్టిన ఈ పనులు దాదాపు 96 శాతం మేర పూర్తయ్యాయి. గుత్తేదారు సంస్థ ఎన్సీసీ మొత్తం 99 గ్రిడ్లుగా విభజించి సుమారు 400 యంత్రాలతో ఈ పనులు చేపట్టింది. తొలగించిన ముళ్ల చెట్లు ఎండిపోయాక ముక్కలుగా కత్తిరించేందుకు ఒక టఫ్ గ్రైండింగ్ మెషీన్ తెచ్చారు.. ఆ ముక్కలను సిమెంట్ పరిశ్రమలు, విద్యుదుత్పత్తి కేంద్రాలకు తరలించనున్నారు. 520 హార్స్ పవర్ ఇంజిన్ తో రోజుకు 50 టన్నులు పొడి చేసే కెపాసిటీ ఉన్న మెషీన్ అది.. ఈ పొడిని బయో డీజిల్ గానూ, బ్రికెట్లు గానూ తయారు చేస్తారు.. అయితే ఇండియాలో ఇవి రెండే ఉండటం విశేషం… త్వరలో మరో ఎనిమిది రప్పించి పని వేగవంతం చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం… మొత్తంగా జంగిల్ క్లియరెన్స్ చివరి అంకంగా ముళ్ళ కంపను పొడి చేసి కర్ణాటకకు తరలిస్తున్నారు.