ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు ఏపీ మంత్రి నారా లోకేష్.. రెడ్మండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన లోకేష్ టీమ్.. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో సమావేశం అయ్యాంది.. ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ లో పనిచేసే తెలుగు ఉద్యోగులు లోకేష్ తో ఫోటోలు దిగారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సత్య నాదెళ్ల తన అపారమైన మేథస్సుతో అంచెలంచెలుగా ఎదిగి మైక్రోసాఫ్ట్ సీఈవో స్థాయికి చేరుకున్నారు.
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..?
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. గత వైసీపీ సర్కార్ హయాంలో రహస్యంగా ఉంచిన జీవోలను జీవోఐఆర్ వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేయాలని నిర్ణయించింది.. 2021 ఆగస్టు 15 తేదీ నుంచి 2024 ఆగస్టు 28 తేదీ వరకూ గోప్యంగా ఉంచేసిన జీవోలన్నింటినీ జీవోఐఆర్ వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేసేలా ఆదేశాలు జారీ చేస్తూ.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు సాధారణ పరిపాల శాఖ
కొలిమిగుండ్లలో ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య ఘటనలో కీలక మలుపు తిరిగింది.. హత్య చేసి చంపింది మేమే నని మీడియా ముందు అంగీకరించారు నిందితులు.. మృతదేహాన్ని బైక్ మీద తీసుకెళ్లి గాలేరు నగరి కాలువలో పడేశామని వెల్లడించారు.. డాక్టర్ ఒంటి మీదున్న బంగారు గొలుసు, రెండు ఉంగరాలు పోలీసులకు అప్పగించారు.. అయితే, నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామంలో జరిగిన ఆర్ఎంపీ డాక్టర్ కొండయ్య హత్య ఘటనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసినట్టు అయ్యింది..
కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవారి ఆలయంలో నవంబర్ నెలలో ప్రత్యేక ఉత్సవాల సీజన్ గా మారింది. శ్రీవారి ఆలయంలో నిత్యం నిత్యోత్సవాలు, ప్రతి వారం వారోత్సవాలు, ప్రతి మాసం మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు.. ప్రతి సంవత్సరం కన్యామాసం శ్రవణా నక్షత్రంతో వూర్తి అయ్యేలా తొమ్మిది రోజులు పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. తొమ్మిది రోజులు పాటు స్వామివారు 16 వాహనాలపై మాడ వీధులలో విహరిస్తూ భక్తులుకు దర్శనం ఇస్తారు. దీనితో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇదే…
నంద్యాల జిల్లాలో పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేయడంతో.. మైనర్ బాలిక బలైంది. నందికొట్కూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో వ్యాసమోల్ తాగి బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది బాధితురాలు..
ఎన్టీఆర్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. స్థానిక మైన్స్, రెవెన్యూ, పోలీస్ అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.. నందిగామలోని కంచల, పెండ్యాలలో సీనరేజ్ వసూలు చేయవద్దని చెప్పినా తవ్వకాలు జరుపుతున్నట్టు గుర్తించింది టాస్క్ ఫోర్స్..
డల్లాస్ లోని పెరోట్ గ్రూప్ అండ్ హిల్వుడ్ డెవలప్మెంట్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్ తోభేటీ అయ్యారు మంత్రి లోకేష్.. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఇన్నోవేటివ్ రియల్ ఎస్టేట్ అండ్ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో మీ వినూత్న విధానాలు మా రాష్ట్ర ఆర్థిక వృద్ధి, స్థిరత్వానికి తోడ్పడతాయి. మీ దార్శనిక ప్రాజెక్టులైన అలయన్స్టెక్సాస్ వంటివి ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల వృద్ధి వ్యూహంతో బాగా సరిపోతాయి. అలయన్స్ టెక్సాస్ తరహాలో పారిశ్రామిక, లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయడానికి ఏపీలోని తీరప్రాంతంలో అనువైన వాతావరణం…