Chandrababu and Pawan Kalyan Vizag Tour: భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విశాఖపట్నం సిద్ధం అవుతోంది.. ఇప్పటికే ప్రధాని మోడీ సభా ప్రాంగణాన్ని SPG ఆధీనంలోకి తీసుకుంది.. AU ఇంజనీరింగ్ గ్రౌండ్ కు 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేశారు.. బయట నుండి వచ్చే వ్యక్తులపై నిఘా ఉంచనున్నారు పోలీసులు.. ఇక, నేడు, రేపు సభా పరిసర ప్రాంతాల్లో నో ప్రయివేట్ డ్రోన్ ఫ్లై విధించారు.. ఈ నేఫథ్యంలో సభా ప్రాంగణంలో 5000 మంది పోలీసులు చేరుకుంటున్నారు… 35 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.. ఇక, ప్రధాని మోడీ కంటే ముందుగానే విశాఖ చేరుకోనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రధాని మోడీకి స్వాగతం పలికి.. ఆ తర్వాత రోడ్‌షోలో పాల్గొనబోతున్నారు..
Read Also: MG Windsor EV Price: పెరిగిన ఎంజీ విండ్‌సోర్ ఈవీ ధర.. లేటెస్ట్ రేట్స్ ఇవే!
సీఎం చంద్రబాబు విశాఖ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్..
* రేపు మధ్యాహ్నం 12:55 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎం చంద్రబాబు..
* సాయంత్రం 4:15కి INS డేగాలో ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్న సీఎం..
* సాయంత్రం 4:45 నుంచి ప్రధాని మోడీతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్‌షో..
* సా.5:30 గంటల నుంచి ప్రధాని మోడీ బహిరంగసభ.
* రేపు రాత్రి 7:30కి వైజాగ్ నుంచి విజయవాడ బయల్దేరనున్న సీఎం చంద్రబాబు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైజాగ్ టూర్..
* రేపు మధ్యాహ్నం విశాఖకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
* మ.12 గంటలకు విశాఖ చేరుకోనున్న పవన్
* సా.4:15 గంటలకు INS డేగాలో చంద్రబాబుతో కలిసి.. ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్న పవన్
* సా.4:45 నుంచి ప్రధాని మోడీతో కలిసి రోడ్ షోలో పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్..
* సా.5:30 గంటల నుంచి ప్రధాని మోడీ బహిరంగసభ
* రేపు రాత్రి 7:25 గంటలకు విశాఖ నుంచి గన్నవరం బయల్దేరనున్న పవన్ కల్యాణ్..