కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి నిల్వలు పేరుకుపోతున్నాయి.. వారంలో 3 రోజులు మాత్రమే ఉల్లి కొనుగోళ్లు చేయడంతో మరింత పేరుకుపోయాయి ఉల్లి నిల్వలు.. దీంతో, ఉల్లి అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు రైతులు.. అర్ధరాత్రి 12 గంటలవరకు మార్కెట్ యార్డులోకి ఉల్లి లారీలు అనుమతించలేదు అధికారులు.. 8 గంటలు రోడ్డుపైనే ఉల్లి లారీలు నిలపాల్సిన పరిస్థితి.
పెప్సికో మాజీ చైర్మన్ మరియు సీఈవో ఇంద్రా నూయితో సమావేశం అయ్యారు మంత్రి నారా లోకేష్.. లాస్ వెగాస్ లో ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో ఈ భేటీ జరిగింది.. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తూ వేగవంతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందన్నారు..
తిరుపతిలో ఎనిమిది హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న (మంగళవారం) రాత్రి 9.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వరుసగా ఈ హోటళ్లకు బెదిరింపు మెయిల్స్ పంపారు. ఇప్పటి వరకు బెదిరింపులే రాగా.. ఈసారి మాత్రం గ్యాస్, వాటర్ పైపులైన్లు, మురుగునీటి పైపులలో పేలుడు పదార్థాలు ఉంచామని మెయిల్స్ వచ్చాయి. ఇలా తాజ్, బ్లిస్, మినర్వా, చక్రి, పాయ్ వైస్రాయ్, రీనెస్టు, గోల్డెన్ దులిఫ్, రమీ గెస్ట్లో లైన్ హోటళ్లకు మెయిల్స్ వచ్చాయి.
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు రెడీ అయింది. మహిళలకు దీపం పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నవంబర్ 1న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక ప్రీ గ్యాస్ సిలిండర్ కోసం బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. రోజు వారీ కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ఆన్ లైన్లో బుక్ చేసుకుంటున్నారు. కొందరు గ్యాస్ కనెక్షన్ బుక్ తో పాటు తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని గ్యాస్ కంపెనీల దగ్గర బుకింగ్…
ఈ రోజు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో సమావేశంకానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకూ నీతి ఆయోగ్ సీఈవోతో సీఎం చంద్రబాబు సమావేశం కొనసాగనుంది.. కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి అమలుపై నీతి ఆయోగ్ సీఈవో జరగనున్న సమావేశంలో చర్చించనున్నారు..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..?
గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెలిగొండ ప్రాజెక్టుకు ఫేక్ ప్రారంభోత్సవం చేశారని దుయ్యబట్టారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.. మంత్రులు నిమ్మల రామానాయుడు.. గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి వలిగొండ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. వెలిగొండ ప్రాజెక్టును గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.. ఆయనే పూర్తి చేసి ప్రారంభిస్తారని తెలిపారు..
మరోసారి తన సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మూడు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ ఇడుపులపాయ చేరుకున్నారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయ చేరుకున్న ఆయనకు.. వైసీపీ నేతలు స్వాగతం పలికారు.. ఆ తర్వత ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఇడుపులపాయ గెస్ట్ హౌస్‌లో వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం అయ్యారు.