Ambati Rambabu: తిరుపతి ఘటనపై సీరియస్ అయ్యారు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు.. మానవ తప్పిదం వల్లే తిరుపతిలో ఆరు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. చంద్రబాబు వైఫల్యం వల్లే ఆరుగురు మృతి చెందారన్నారు. దుర్మార్గంగా వ్యవహరించారు కాబట్టే ఈ ఘటన జరిగిందని.. అధికారులపై కోపాన్ని చూపించిన చంద్రబాబు ఏం సాధించారని నిలదీశారు.. అధికారులను తిట్టి తనపనై పోయిందని చంద్రబాబు భావిస్తున్నాడని.. కానీ, ఇదే నిర్లక్ష్యం కొనసాగితే ఇలాంటి ప్రమాదాలు ఇంకా జరిగే అవకాశం ఉందన్నారు. ఏడు కొండలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించారు అంబటి రాంబాబు..
Read Also: Hardeep Nijjar murder: ఖలిస్తానీ నిజ్జర్ హత్య కేసులో నలుగురు భారతీయులకు బెయిల్..
సనాతన ధర్మాన్ని కాపాడే పోరాట యోధుడు ఇంతవరకు ఏం మాట్లాడలేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు అంబటి రాంబాబు.. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, క్షతగాత్రులకు 25 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.. ఘటనను మసిబూసి మారేడు కాయ చేయాలని చూశారని.. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారన్నారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే మృతుల ఆత్మ శాంతిస్తుందన్నారు. వైసీపీని అణిచి వేయాలని చూస్తే అగ్నిపర్వతంలాగా తయారవుతుందని వార్నింగ్ అంబటి రాంబాబు..
Read Also: Sankranti Movies : ఇప్పటి వరకు సంక్రాంతి కింగ్ హనుమానే.. ఆ రికార్డు బ్రేక్ అవుతుందా ?
తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని ఘోర ప్రమాదం ఇది అన్నారు అంబటి రాంబాబు.. తిరుమల ఏపీలో ఉండటం మనకు గర్వకారణం.. తిరుమల రద్దీ రానురానూ పెరుగుతుంది.. వైకుంఠ ద్వార దర్శనం ప్రతీ భక్తుడి కోరిక.. ఇది అందరికీ తెలుసు.. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు అధికారుల ఒత్తిడి గమనించాను అన్నారు. దైవాన్ని సందర్శించాలని వచ్చిన ఆరు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి.. ఘటనకు ఎవరు బాధ్యత వహించాలని అని నిలదీశారు.. టీటీడీ, ఈవో, జేఈవోలే ఘటనకు ప్రధాన కారణం.. వారికి టీటీడీ సేవ చేయాలన్న దృక్పథం కన్నా టీడీపీకే ఎక్కువ సేవ చేస్తున్నారు.. గతంలో జగన్ కొండ మీదకు వస్తానంటే పెద్ద బోర్డులు కట్టారని గుర్తు చస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..