CM Chandrababu: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. ఈ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఘటనపై ఆరా తీసినప్పటి నుంచి సమీక్ష సమావేశం వరకు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతూనే ఉన్నారు.. టోకెన్ల కోసం వచ్చి తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం.. ఇంకా కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. తొక్కిసలాట ఘటనతో పాటు రేపటి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై కూడా చర్చించినట్టుగా తెలుస్తుండగా.. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకన్న చౌదరీ, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరులు, ఎస్పీ సుబ్బారాయుడు, మంత్రులు సత్యకూమార్, నిమ్మల, ఇతర అధికారులు పాల్గొన్నారు.. తొక్కిసలాట సహా జరిగిన ఘటనలపై 40 నిమిషాలకుపైగా చర్చించారు..
Read Also: USA: ప్రియురాలితో గొడవపడి ఫ్లైట్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసిన వ్యక్తి..
అయితే, టీటీడీ ఉన్నాధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. సమీక్షలో టీటీడీ ఈవోపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. అజాగ్రత్తగా ఉండడం వల్లే ఇంతటి దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని ప్రక్షాళన చేస్తానన్న నమ్మకంతోనే ప్రజలు మాకు ఓట్లు వేశారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు.. అసలు దర్శన టోకన్ల కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు..? అని సమావేశంలో నిలదీశారు.. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఏ మాత్రం సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..