తిరుపతిలో మరో మైనర్ బాలిక.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమని వ్యక్తి మాటల్లో పడి సర్వం అర్పించింది.. చివరకు ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది..
జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014-19 మధ్య టీడీపీ పాలనలో వెలిగొండ ప్రాజెక్టుకు 1373 కోట్ల రూపాయాలు కేటాయించి 96 శాతం ఖర్చు చేశాం.. కానీ, గత ఐదేళ్లలో జగన్ పాలనలో 3,518 కోట్ల బడ్జెట్ కేటాయించి కేవలం 170 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని.. జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.. పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హై కోర్టును ఆశ్రయించారు ఎంపీ మిథున్ రెడ్డి.. అయితే, ఈ రెండు కేసుల్లో ఎంపీ మిథున్ రెడ్డితో సహా ఐదుగురికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది ఏపీ హైకోర్టు.
నంద్యాలలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.. పట్ట లోని సలీమ్ నగర్ ప్రాంతానికి చెందిన ఫరూక్ ఆటో డ్రైవర్ ఫరూక్.. రైల్వే స్టేషన్ లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. రైలు ప్లాట్‌ఫామ్ మీద ఆగడానికి వస్తున్న సమయంలో ఆటో డ్రైవర్ ఫరూక్ పట్టాలపైకి దూకాడు. క్షణాల్లో రైలు అతనిపై నుంచి దూసుకెళ్లింది..
పగలు, పట్టింపులు, శత్రుశ్వాలు పక్కనబెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.. విశాఖపట్నంలో పర్యటిస్తున్న ఆయన.. VMRDA ఎరీనలో ప్రధాన మంత్రి రోజ్ గార్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు బండి సంజయ్.
శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సీఈవో శంతను నారాయణ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ.. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతోంది, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులకు అన్నివిధాల అనుకూలమైన ప్రాంతమని వివరించారు..
నా పేరు చెప్పి కబ్జాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. తన పేరు చెప్పి కొందరు భూ కబ్జాలు చేస్తున్నారని, అటువంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం..
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ.. ఏపీని సందర్శించండి..! ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది.. ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలతో భేటీ అయిన ఆయన.. తాజాగా ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు.. రెడ్మండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన లోకేష్ టీమ్.. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో సమావేశం అయ్యాంది.. ఈ సందర్భంగా […]
తిరుపతిలో ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.. తిరుపతి రూరల్ లో ఓ ప్రైవేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్న వెంకటప్రసాద్.. స్థానికంగా శ్రీపురం కాలనీలో నివాసం ఉంటున్నారు.. 2012లో తిరుపతికి చెందిన మాధురిని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నాడు వెంకట ప్రసాద్ ..