CM Chandrababu: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైంకుఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీ కేంద్రం దగ్గర జరిగిన తొక్కొసలాట ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఆ తర్వాత స్విమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన సీఎం.. తదనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు.. టీటీడీ ఉన్నాధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. సమీక్షలో టీటీడీ ఈవోపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. అజాగ్రత్తగా ఉండడం వల్లే ఇంతటి దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని ప్రక్షాళన చేస్తానన్న నమ్మకంతోనే ప్రజలు మాకు ఓట్లు వేశారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు.. అసలు దర్శన టోకన్ల కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు..? అని సమావేశంలో నిలదీశారు.. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఏ మాత్రం సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Bachchalamalli : “బచ్చల మల్లి” ఓటిటి రిలీజ్ డేట్ లాక్
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం.. తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పు పరిహారం ఇస్తామని.. ఆ కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తాం అన్నారు.. టీటీడీపై జరిగిన సమీక్షలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం.. నేను చెప్పిన వాటిని టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.. అసమర్ధత, అనాలోచిత నిర్ణయాల వల్ల పవిత్రతకు భంగం కలగకూడదు.. రాజకీయాలకు అతీతంగా.. శ్రీవారికి సేవ చేస్తున్నాం అనే భావన ఉండాలని సూచించారు.. కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.. డీఎస్పీ రమణకుమార్ బాధ్యత లేకుండా పనిచేశారు.. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిని సస్పెండ్ చేస్తున్నాం అని ప్రకటించారు.. ఇక, ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమి, టీటీడీ ముఖ్య భద్రతాధికారి శ్రీధర్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం అన్నారు.. అంతే కాదు.. తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించనున్నట్టు వెల్లడించారు..
Read Also: Jitendra Yunik EV Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. రయ్.. రయ్.. మంటూ 118 కి.మీ.ల మైలేజ్
జరగకూడని ఘటన. చాలా బాధాకరం అన్నారు సీఎం చంద్రబాబు.. తొక్కిసలాట వార్త మనసు కలచివేసిందన్న ఆయన.. శ్రీవారి సన్నిధిలో ఎలాంటి అపచారాలు జరగకూడదు అని నా భావన.. ఇలాంటివి పునరావృతం కాకుండా చేయడానికి తీసుకోదగ్గ చర్యలపై చర్చించాను.. మన చర్యల వల్ల దేవుని పవిత్రత దెబ్బ తినకూడదు.. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే.. తిరుపతిలో దర్శన టోకెన్లు ఇవ్వడం కొత్త సంప్రదాయం.. ఇది కరెక్ట్ కాదని భక్తులు భావిస్తున్నారని తెలిపారు.. వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు కొనసాగించాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలియడం లేదు… శాస్త్రంలో ఇది లేదన్న ఆయన.. మరణించిన ఆరు మంది కుటుంబాల ఒక్కొక్కరికి పాతిక లక్షలు ఇస్తాము.. వీరి కుటుంబంలో ఒక్కరికీ కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తాం.. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికీ ఐదు లక్షలు రూపాయలు చెల్లిస్తాం.. గాయాలు పాలైన 33 మందికి ఒక్కొక్కరికి రెండు లక్షలు రూపాయలు పరిహారంగా ఇస్తాం. ఇలాంటి ఘటనలు జరగకుండా పరిపాలన సక్రమంగా ఉండాలి. కానీచ ఈ విషయంలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి అన్నారు.. అందుకే డీఎస్పీ రమణ కుమార్, ఎస్వీ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ఇద్దరినీ సస్పెండ్ చేస్తున్నాం.. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, టిటిడి ముఖ్య భద్రతాధికారి శ్రీధర్ ను బదిలీ చేస్తున్నాం అని ప్రకటించారు..
Read Also: ZEE Telugu: సంక్రాంతికి ప్రేక్షకుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపేందుకు వచ్చేస్తున్న జీ తెలుగు..
పాత సంప్రదాయాన్ని కొనసాగించారు.. అరగంట ముందుగా కనుక భక్తులను క్యూ లైన్ లో పంపి ఉంటే ఘటన జరిగేది కాదనున్నారు సీఎం చంద్రబాబు.. డీఎస్పీ అనాలోచితంగా వ్యవహరించడంతోనే ఈ ఘటన జరిగిందన్నారు.. నా దృష్టిలోకి వచ్చిన ప్రతి సమస్య పరిష్కారిస్తాను. పది రోజులపాటు నిర్వహించే వైకుంఠ ఏకాదశి దర్శనాలపై టీటీడీ నిర్ణయం తీసుకుంటుందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..