CM Chandrababu Serious: తిరుపతి ఘటనపై సీఎం సీరియస్.. వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు..
- తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్..
- టీటీడీ ఈవోపై సీఎం ప్రశ్నల వర్షం..
- ఎందుకు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డ సీఎం..
- అసలు టీటీడీ ఈవోకు సమాచారం ఎప్పుడు వచ్చిందని ప్రశ్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Serious: తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ ఈవోపై సీరియస్ అయ్యారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, తొక్కిసలాట జరిగే ప్రమాదముందని తెలిసినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. అసలు టీటీడీ ఈవోకు సమాచారం ఎప్పుడు వచ్చిందని ప్రశ్నించారు. మీ ప్లానింగ్ ఏంటి.. భక్తులు వస్తారని తెలిసి ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని ముఖ్యమంత్రి నిలదీశారు. పోలీస్, టీటీడీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని నివేదిక వచ్చిందని, బాధ్యులను ఫిక్స్ చేసి వెంటనే వారిని సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అసలు కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం ఎందుకు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఘటనలో అధికారుల వైఫల్యం స్పష్టంగా ఉందని ప్రాథమిక నివేదిక వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
టీటీడీ ఈవోతో పాటు జేఈవో గౌతమీపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఇది పద్ధతి కాదు, పద్ధతి ప్రకారం పని చేసేది నేర్చుకోండి.. మీరు సమాధానం చెప్పండి.. ఈ కేంద్రం వద్ద ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు.. ప్రతి ఒక్కరికి చెప్తున్నా.. పద్ధతి ప్రకారం నడుచుకోండి.. తమాషాలనుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.. బాధ్యతలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. ఇక్కడ నో ఎక్స్క్యూజ్.. అని స్పష్టం చేశారు.. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి.. ఎందుకు జరిగిందో చెప్పండి..? భక్తులను ఉంచేందుకు కొత్త ప్లేస్ ఎంపిక చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా? అని నిలదీశారు.. ఇక్కడ నియమించిన పోలీస్ ఆఫీసర్ కి జాగ్రత్తలు చెప్పారా..? ఆ గేటు తీస్తే తొక్కిసలాట జరుగుతుందని ఎందుకు ఊహించలేదు అని కలెక్టర్‌పై ఫైర్ అయ్యారు.. ఘటనా స్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చింది..? టోకెన్లు ఆఫ్‌లైన్‌లో ఎన్ని ఇచ్చారు.. ఆన్‌లైన్‌లో ఎన్ని ఇచ్చారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. గత విధానం కొనసాగించకుండా కొత్త విధానం ఎంపిక చేసుకుని ఉండాల్సింది.. అలా చేస్తారని మిమ్మల్ని పంపించాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..