తెలంగాణలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన దేవస్థానం శ్రీ కురుమూర్తి వేంకటేశ్వర దేవస్థానం. తిరుమల వేంకటేశ్వర ఆలయానికి, కురుమూర్తి ఆలయాని కి పోలికలున్నాయి. అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఏడు కొండల మధ్య లక్ష్మీ సమేతంగా స్వయంభూగా వెలసిన స్వామి వారు పేదల తిరుపతిగా ఇక్కడ మొక్కులందుకుంటున్నారు. పూర్వం కురుమూర్తికి ‘కురుమతి’ పేరు ఉన్నట్లు ఆలయ చరిత్ర ప్రకారం తెలుస్తోంది. ఇక, పేదల తిరుపతిగా విలసిల్లుతున్న కురుమార్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. యాగశాల మండపాలంకరణంతో వేడుకలు మొదలయ్యాయి.
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కొందరు ముసుగు ధరించిన దొంగలు ఆయన ఇంటిని టార్గెట్ చేశారు. అయితే, పాకిస్థాన్ పర్యటనలో ఉన్నారు బెన్ స్టోక్స్.. అసలే సిరీస్ ఓటమి బాధలో ఉన్న అతడికి మరో దెబ్బ తగిలింది.. ఇంట్లో దొంగలు పడి ఎన్నో విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు.. స్టోక్స్ భార్య, పిల్లలు ఇంట్లో ఉండగానే ఈ ఘటన జరిగింది.. అయితే, తన కుటుంబానికి భౌతికంగా ఎటువంటి హాని జరగలేదని, అయితే వారి విలువైన వస్తువులు.. సెంటిమెంట్తో కూడకున్న వస్తువులు…
విశాఖపట్నంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. జైలు రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మెయిన్ బ్రాంచ్ లో ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో మంటలు మంటలు చెలరేగాయి.. వెంటనే స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం అంటూ ఇండియాస్పోరా, యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం సందర్భంగా వెల్లడించారు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్టాన్సిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, సువిశాలమైన తీర ప్రాంతం, విస్తృతమైన రోడ్డు, జల, వాయురవాణా మార్గాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొందని, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించే వారికి ఇదే మంచి సమయం అన్నారు.
ఒంగోలు పండుగలకు ఎంతో ప్రత్యేకం.. దసరా సంబరాల్లో కళారాలు.. దీపావళికి సత్యభామ.. నరకాసుర వధ.. వంటి సాంప్రదాయ కళలను, కళాకారులను ప్రోత్సహిస్తారు. అందులో భాగంగా దీపావళి రోజున సత్యభామ, నరకాసుర వధ వీధి పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు ప్రదర్శిస్తారు.. 1902 వ సంవత్సరం నుంచి ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ లో ఉన్న యువజన మిత్ర మండలి నిర్వహించే నరకాసుర వధ కార్యక్రమం ఇంకెక్కడా కనిపించదు..
శాన్ ఫ్రాన్సిస్కో లో సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లాప్రగడ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వారికి వివరించారు. సేల్స్ ఫోర్స్ కార్యకలాపాల గురించి వివరిస్తూ... సేల్స్ఫోర్స్ కంపెనీ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (CRM) , క్లౌడ్-ఆధారిత సొల్యూషన్స్లో గ్లోబల్ లీడర్ గా ఉందని.. కస్టమర్ ఇంటరాక్షన్లు, సేల్స్ అండ్ సర్వీస్ ఆపరేషన్లను నిర్వహించడానికి సాధికారత కల్పించే సాధనాలను సరఫరా చేస్తుందన్నారు..
అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నారు ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. రాష్ట్రంలో పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతుండగా.. తన పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో లోని గూగుల్ క్యాంపస్ ను సందర్శించారు లోకేష్.. గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ తో పాటు వైస్ ప్రెసిడెంట్లతో సమావేశం..
కడప జిల్లా పర్యటన ముగించుకుని ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు బయల్దేరి వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. జిల్లాలో మూడు రోజుల పర్యటనలో బిజీ బిజీగా గడిపారు జగన్... జమ్మలమడుగు, కడప నియోజకవర్గాలకు సంబంధించిన నేతల మధ్య ఉన్న విభేదాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. అయితే, ఈ రోజు ఉదయమే బెంగళూరు వెళ్లాల్సి ఉండగా.. ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కారణంగా మాజీ సీఎం హెలికాప్టర్ కు ఎయిర్ కంట్రోల్ నుంచి అనుమతులు త్వరగా రాలేదు.. వాతావరణం…