ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా విజయనగరం షెడ్యుల్ రద్దు అయ్యింది. దీంతో రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమం అనకాపల్లి జిల్లాకు మారింది. శ్రీకాకుళం నుంచి నేరుగా పరవాడ ఫార్మా సిటీలోని లారస్ ఫార్మా కంపెనీ అడ్మిన్ బిల్డింగ్ కు చంద్రబాబు చేరుకుంటారు.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియంలో వివాహిత అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన నర్సరీ మహిళా కూలీ రౌతు కస్తూరి.. గత నెల 15న చొప్పెల్ల లాకుల వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే, ఆమె పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తేలింది.
దీపావళి పండుగ రోజున ఏలూరు నగరంలో విషాదం చోటు చేసుకుంది. దీపావళి టపాసులను బైక్‌పై తీసుకెళ్తుండగా ఒక్కసారి పేలిపోయాయి.. బండి గోతిలో పడి టపాసులు రాపిడికి గురై పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈ పేలుడు దాటికి వాటిని తరలిస్తున్న వ్యక్తి శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరిపడింది. పేలుడు దాటికి యాక్టివా బండి పూర్తిగా దగ్ధమైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.. రేపు సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో మహిళలకు దీపం పథకాన్ని ప్రారంభించనున్నారు.. మొదట 833 రూపాయలు డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోపు కస్టమర్ల ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన దేవస్థానం శ్రీ కురుమూర్తి వేంకటేశ్వర దేవస్థానం. తిరుమల వేంకటేశ్వర ఆలయానికి, కురుమూర్తి ఆలయాని కి పోలికలున్నాయి. అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఏడు కొండల మధ్య లక్ష్మీ సమేతంగా స్వయంభూగా వెలసిన స్వామి వారు పేదల తిరుపతిగా ఇక్కడ మొక్కులందుకుంటున్నారు. పూర్వం కురుమూర్తికి ‘కురుమతి’ పేరు ఉన్నట్లు ఆలయ చరిత్ర ప్రకారం తెలుస్తోంది. ఇక, పేదల తిరుపతిగా విలసిల్లుతున్న కురుమార్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. యాగశాల మండపాలంకరణంతో వేడుకలు మొదలయ్యాయి.
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కొందరు ముసుగు ధరించిన దొంగలు ఆయన ఇంటిని టార్గెట్ చేశారు. అయితే, పాకిస్థాన్ పర్యటనలో ఉన్నారు బెన్ స్టోక్స్.. అసలే సిరీస్ ఓటమి బాధలో ఉన్న అతడికి మరో దెబ్బ తగిలింది.. ఇంట్లో దొంగలు పడి ఎన్నో విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు.. స్టోక్స్ భార్య, పిల్లలు ఇంట్లో ఉండగానే ఈ ఘటన జరిగింది.. అయితే, తన కుటుంబానికి భౌతికంగా ఎటువంటి హాని జరగలేదని, అయితే వారి విలువైన వస్తువులు.. సెంటిమెంట్‌తో కూడకున్న వస్తువులు…