* తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు.. ఊరు-వాడ భోగి మంటలు.. రంగుల ముగ్గులతో మెరిసిపోతున్న తెలుగు లోగిళ్లు
* నేడు జమ్మూ-కశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. గాందర్‌బల్ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్ సొరంగాన్ని ప్రారంభించనున్న మోడీ.. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై రూ.2,400 కోట్లతో నిర్మాణం..
* ఢిల్లీ: నేడు సాయంత్రం కిషన్ రెడ్డి నివాసానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. కిషన్ రెడ్డి నివాసంలో జరిగే సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్న ప్రధాన మంత్రి.. సాయంత్రం 5 గంటలకు సంక్రాంతి సంబరాలు.. హాజరు కానున్న ప్రధాని మోడీ, బీజేపీ అగ్రనేతలు, తెలుగు రాష్ట్రాల ఎంపీలు, ప్రముఖులు
* ఖమ్మం: నేడు జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల, ఉత్తమ్, పొంగులేటి పర్యటన.. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసాలపై అధికారులతో రివ్యూ..
* ఖమ్మం: కూసుమంచి లోని పొంగులేటి క్యాంప్ కార్యాలయం లో భోగి పండుగ వేడుకలు… సంప్రదాయ పద్ధతిలో బోగి మంటలో గంగిరెద్దుల ప్రదర్శన లు
హరిదాసు సంకీర్తనలు.. పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
* ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత.. సంగారెడ్డి జిల్లా అల్మాయిపేట 13.6, లక్ష్మీసాగర్ 14, చౌటకూర్ 14.1 డిగ్రీల ఉష్ణోగ్రత.. మెదక్ జిల్లా దామరంచ 14.6, టేక్మాల్ 15.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత.. సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట 15.2, హబ్సిపూర్ 15.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
* తిరుపతి: నేడు నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు నాయుడు.. 15 ఈ ఆటోలు, నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు ప్రారంభించనున్న సీఎం.. గ్రామంలో సబ్ స్టేషన్, ఏ.రంగంపేటలోని హైస్కూల్’లో కోటి రూపాయలతో డిజిటల్ క్లాస్ నిర్మాణానికి పునాదులు ..
* ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి టంగుటూరు మండలం తూర్పు నాయుదుపాలెం లోని క్యాంప్ కార్యాలయంలో ఉంటారు..
* ప్రకాశం: మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిలకలూరిపేట లోని ఆయన నివాసంలో ఉంటారు..
* ప్రకాశం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కారంచేడులో భోగి వేడుకల్లో పాల్గొంటారు..
* తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం.. 19వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం .. తిరుపతిలో రేపటికి సంబంధించిన దర్శన టోకెన్లు జారీ చేస్తున్న టీటీడీ..
* తిరుపతి: మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి వేడుకలు.. భోగి వేడుకల్లో పాల్గొన్న కుటుంబ సమేతంగా పాల్గొన్న సినీ నటుడు మోహన్ బాబు, మంచు విష్ణు
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయంలో ఘనంగా భోగి వేడుకలు.. పెద్ద ఎత్తున భోగిమంటలు వేసిన ఆలయ అధికారులు.. తెలుగువారి సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబందిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు.. హరిదాసు, గంగిరెద్దులు, డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా భోగి వేడుకలు
* అనకాపల్లి జిల్లా: సంక్రాంతి సంబరాలలో భాగంగా నేడు అనకాపల్లి పట్టణ సమీపంలోని ఉమ్మలాడ గ్రామంలో జిల్లాస్థాయి ఎడ్ల బండి పోటీలు ఏర్పాటు, జిల్లా నలుమూలల నుండి సుమారు 30 ఎడ్ల బండ్లు పాల్గొనే అవకాశం…
* నెల్లూరు జిల్లా: నెల్లూరు నగరంలోని మూలా పేట.. శెట్టిగుంట రోడ్ సెంటర్లలో జరిగిన భోగి వేడుకలలో పాల్గొన్న మంత్రి నారాయణ.
* ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన భోగి సంబరాలు.. దుగ్గిరాలలో భోగిమంటలు వేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని.. చిన్న, పెద్ద, గ్రామస్తులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..
* చిత్తూరు: నగిరి నివాసంలో కుటుంబ సమేతంగా భోగి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి రోజా
* విశాఖ నగరంలో భోగి పండుగ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వీధివీధిన భారీగా భోగి మంటలు వేసి సంబరాలు చేసుకుంటున్నారు. ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్లో సాంప్రదాయ గిరిజన నృత్యం థింసా, సంస్కృతిక ప్రదర్శనలు ఉత్సాహంగా జరుగుతున్నాయి.
* శ్రీ సత్యసాయి : ధర్మవరంలో జరిగే సంక్రాంతి వేడుకలలో పాల్గొననున్న మంత్రి సత్యకుమార్
* విశాఖ: భోగి వేడుకలలో సందడి చేసిన సినీ నటుడు సాయికుమార్… భోగి మంటలు వేసి సంబరాలు ఫ్యామిలీతో సహా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న నటుడు..
* విశాఖ: ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్లో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు… GVL మహా సంక్రాంతి సంబరాల పేరుతో వేడుకలు నిర్వహిస్తున్న మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. సాంస్కృతిక ప్రదర్శనలు, థింసా నృత్యాలతో కోలాహలంగా మొదలైన పండుగ.. సైబర్ నేరాలపై అవగాహన థీమ్ తో ఉత్సవాలు చేస్తున్న GVL..
* నంద్యాల: నేడు శ్రీశైలంలో 3వరోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. కైలాస వాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్న ఆది దంపతులు.. సాయంత్రం క్షేత్ర వీధుల్లో శ్రీస్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం
* నేడు శ్రీశైలంలో మల్లికార్జునస్వామికి వార్షిక ఆరుద్రోత్సవం.. ధనుర్మాసంలోని ఆరుద్ర నక్షత్రం వార్షిక ఆరుద్రోత్సవంగా నిర్వహిస్తున్న దేవస్థానం .. ఆలయ ఉత్తరద్వారంలో శ్రీస్వామి అమ్మవారిని తీసుకువచ్చి ప్రత్యేక పూజలు.. ఉత్సవమూర్తులను నందివాహనంపై క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం
* మహానంది క్షేత్రంలో నేటి నుండి సంక్రాంతి వేడుకలు, చిన్నారులకు భోగి పండ్లు పోసే కార్యక్రమం.. సంజీవనగర్ రామాలయంలో నేడు శ్రీ దేవి , భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారి కల్యాణం
* తిరుపతి: అరగొండ దిగువమాఘంలోని తమ నివాసంలో కుటుంబ సమేతంగా భోగి పండుగ చేసుకున్న గల్లా అరుణకుమారి దంపతులు , గల్లా జయదేవ్
* విజయవాడ గొల్లపూడి వన్ సెంటర్ లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించిన కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్