Kiran Kumar Reddy: వైఎస్ ఉన్నా రాష్ట్ర విభజన ఆగేది కాదు..! కిరణ్‌కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- రాష్ట్ర విభజనపై మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నా విభజన ఆగేది కాదన్న కిరణ్..
- వైఎస్ తోనే విభజనకు అనుకూలం అనే తీర్మానాన్ని 2009లోనే..
- కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీలో పెట్టించాలని చూసిందన్న మాజీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran Kumar Reddy: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే.. అసలు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేది కాదని చాలా మంది చెబుతుంటారు.. కానీ, ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి.. విజయవాడలో జరిగిన సంక్రాంతి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, రాజశేఖర్ రెడ్డి తోనే రాష్ట్ర విభజనకు అనుకూలం అనే తీర్మానాన్ని 2009లోనే కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీలో పెట్టించాలని చూసిందని పేర్కొన్నారు.. 2014లో జరిగిన రాష్ట్ర విభజన 2009లోనే జరిగాల్సింది ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Massive Theft in Gold Shop: ఏలూరులో కలకలం.. సినిమాలను తలదన్నే రేంజిలో చోరీ..
Also Read
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
- NTR Health University: విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు.. జీవో 102పై హెల్త్ యూనివర్సిటీ క్లారిటీ
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ ఫోకస్
- Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
ఈ సందర్భంగా అప్పటి విషయాలను గుర్తుచేసుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి.. నేను చీఫ్ విప్‌గా ఉన్నప్పుడు వైఎస్ పిలిచి ”మేం తెలంగాణ రాష్ట్రానికి అనుకూలం’ అనే తీర్మానం అసెంబ్లీలో పెట్టాలని చెప్పారు.. ఇదేంటి ఎన్నికలకు వెళ్లే ముందు ఇలా పెడితే మనం ఒడిపోతాం అని తాను రాజశేఖర్‌రెడ్డితో అన్నాను. కానీ, నా చేతుల్లో ఏం లేదు.. రాష్ట్ర విభజన చేయాలని ప్రణబ్ ముఖర్జీ చెప్పారని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారని పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడి.. ‘మేం తెలంగాణకు అనుకూలం’ అనే తీర్మానాన్ని ‘మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు’ అని మార్చి పెట్టామని వెల్లడించారు. అయినా రాష్ట్ర విభజన జరగదని అనుకున్నాం. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయింది. వైఎస్ ఉన్నా రాష్ట్ర విభజన ఆగేది కాదంటూ కొత్త చర్చకు తెరలేపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి..
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?