దీపావళి కానుకగా సూపర్ సిక్స్ లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకం అమల్లోకి తీసుకురాబోతోంది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్యాస్ బుకింగ్స్ ప్రారంభమైన విషయం విదితమే.. అయితే, ఈ పథకం లబ్ధిదారులకు గుడ్న్యూస్ చెబుతూ.. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. మొదటి విడతకు అయ్యే ఖర్చు 894 కోట్ల రూపాయల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు ఈ రోజు అందజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
మహిళల కోసం ఉచితంగా మూడు సిలిండర్ల పథకం తీసుకొచ్చాం అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.. అయితే, ఈ పథకంలో ఎవరూ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదన్నారు.. గ్యాస్ కనెక్షన్, రైస్ కార్డు (రేషన్ కార్డు)లకు ఆధార్ కార్డు నంబర్ అనుసంధానం చేసుకుని ఉంటే చాలు.. వారు అర్హులే అని స్పస్టం చేశారు..
అన్నమయ్య జిల్లా రాజంపేటలో మందు ప్రియులకు కిక్కు ఇచ్చే దివాళి బోనంజ ఆఫర్ ప్రకటించారు బార్లు. వైన్స్ షాప్ యజమానులు. మద్యం బాటిల్ కొనండి సర్వం మేమే సమకూరుస్తాం అంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు..
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఈఎస్ఐ అధికారులు నోటీసులు జారీ చేశారు... 2013లో జరిగిన పీఎఫ్ నిధుల గోల్మాల్ వ్యవహారంలో, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని, రెండు నెలల క్రితం యూనివర్సిటీ అధికారులకు ఈఎస్ఐ అధికారులు నోటీసులు పంపించారు..
సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.. ఎలా బెదిరిస్తే.. తమ ఉచ్చులో పడతారు..? ఎలా వారిన తమ దారిలోకి తెచ్చుకోవాలి.. ఎలా అందినకాడికి దండుకోవాలనే విషయంలో రోజుకో కొత్త వ్యూహంతో సైబర్ నేరగాళ్లు వల విసిరుతున్నారు.. తాజాగా, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన రైల్వే ఉద్యోగికి రూ.72 లక్షల కుచ్చుటోపీ పెట్టారు సైబర్ నేరగాళ్లు.
కడపలో అన్నా క్యాంటీన్ వంటశాలలో భారీ పేలుడు సంభవించింది... కడప మార్కెట్ యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్ ఆహార తయారీశాల వద్ద ఉన్న వంటశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగింది..
కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి నిల్వలు పేరుకుపోతున్నాయి.. వారంలో 3 రోజులు మాత్రమే ఉల్లి కొనుగోళ్లు చేయడంతో మరింత పేరుకుపోయాయి ఉల్లి నిల్వలు.. దీంతో, ఉల్లి అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు రైతులు.. అర్ధరాత్రి 12 గంటలవరకు మార్కెట్ యార్డులోకి ఉల్లి లారీలు అనుమతించలేదు అధికారులు.. 8 గంటలు రోడ్డుపైనే ఉల్లి లారీలు నిలపాల్సిన పరిస్థితి.
పెప్సికో మాజీ చైర్మన్ మరియు సీఈవో ఇంద్రా నూయితో సమావేశం అయ్యారు మంత్రి నారా లోకేష్.. లాస్ వెగాస్ లో ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో ఈ భేటీ జరిగింది.. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తూ వేగవంతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందన్నారు..