శ్రీశైలంలో కార్తీకమాస మొదటి సోమవారం మల్లన్నకు ప్రీతికరమైన రోజు.. దీంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది.. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
విశాఖ నుండి అమరావతి కి రెండు గంటల్లోనే చేరుకొనేలా చేస్తాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ ముంబై వరకు బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి.. అలాంటివి మనకి వస్తే ప్రయాణికులకు ఇంకా సౌలభ్యంగా ఉంటుందన్నారు.. విభజన చట్టంలో విశాఖ రైల్వే జోన్ కోసం భూమి ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంది గత ప్రభుత్వం.. అధికారంలోకి రాగానే 52 ఎకరాల్లో భూమి ఇచ్చి పనులు మొదలు పెట్టమని ఆదేశాలు ఇచ్చాం అన్నారు.. సంపద సృష్టిచాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి.. భవిష్యత్ లో మనకి కావాల్సిన ఎయిర్ పోర్ట్…
గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీషీటర్ నవీన్ దాడితో బ్రెయిన్డెడ్ కు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన మధిర సహన కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఈ రోజు.. ఆ కుటుంబానికి అందజేశారు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు..
ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరమ్మతులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం గ్రామం పరవాడ జంక్షన్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఏర్పాటు కావాలి.. 5 ఏళ్లు గుంతలు తవ్వాడు.. రాష్ట్రానికి ప్రమాదమైన గోతులు తవ్వాడు.. నరకానికి కేరాఫ్ అడ్రస్ గా రాష్ట్ర రోడ్లు మార్చారు అని దుయ్యబట్టారు..
ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైలం మల్లికార్జునస్వామి క్షేత్రంలో కార్తీక మసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.. నేటి నుండి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కాగా.. డిసెంబర్ 1 వతేదీ వరకు జరగనున్నాయి.. కార్తీక మసోత్సవాల ప్రారంభంలో భాగంగా వేకువజామనే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ముందు ఉన్న గంగాధర మండపం వద్ద అలానే క్షేత్రంలో పలు చోట్ల కార్తీక దీపాలు వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు.. అనంతరం శ్రీస్వామి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్స్ క్యూ కంపార్టుమెంట్ లలో ఓం:నమశ్శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ బారులు తీరారు..
ఎన్నికల సమయంలో ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రస్తుతం వాటిని అమలు చేయలేక మాటలు చెబుతున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు..
తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారి హత్యాచారంపై ఘటనపై విచారం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. వడమాల పేట మండలం ఎఎంపురం గ్రామ చిన్నారి హత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలుపుతూ.. రూ.10 లక్షలను బాధిత కుటుంబానికి అందచేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ను ఆదేశించారు సీఎం చంద్రబాబు.
ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉయ్యూరులో కలకలం రేపుతోంది.. గతంలో ప్రేమించుకున్న ఓ జంట.. మనస్పర్ధలు రావడంతో 2021లో విడిపోయారు.. అప్పటి నుంచి వాళ్లు దూరంగానే ఉంటున్నారని చెబుతున్నారు.. అయితే, గత రాత్రి తన మాజీ ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. తనకు ఇచ్చి పెళ్లి చేయాలని.. సదరు యువతి కుటుంబ సభ్యులను అడిగాడు.. కానీ, వాళ్లు పెళ్లికి నిరాకరించడంతో.. అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్నారు..