మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు మంత్రి కందుల దుర్గేష్.. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ కు గురై మృతి చెందిన మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన ఆయన.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
తూర్పుగోదావరి జిల్లాలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీ కడుతూ వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణ అనే నలుగురు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.…
ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ తో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.. విగ్రహావిష్కరణ ఇప్పటికే వివాదాస్పదం కాగా.. విగ్రహావిష్కరణ రోజునే విషాదం మిగిల్చింది. విద్యుత్ షాక్ నలుగురిని విగత జీవులుగా మార్చింది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది..
శ్రీశైలంలో కార్తీకమాస మొదటి సోమవారం మల్లన్నకు ప్రీతికరమైన రోజు.. దీంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది.. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
విశాఖ నుండి అమరావతి కి రెండు గంటల్లోనే చేరుకొనేలా చేస్తాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ ముంబై వరకు బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి.. అలాంటివి మనకి వస్తే ప్రయాణికులకు ఇంకా సౌలభ్యంగా ఉంటుందన్నారు.. విభజన చట్టంలో విశాఖ రైల్వే జోన్ కోసం భూమి ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంది గత ప్రభుత్వం.. అధికారంలోకి రాగానే 52 ఎకరాల్లో భూమి ఇచ్చి పనులు మొదలు పెట్టమని ఆదేశాలు ఇచ్చాం అన్నారు.. సంపద సృష్టిచాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి.. భవిష్యత్ లో మనకి కావాల్సిన ఎయిర్ పోర్ట్…
గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీషీటర్ నవీన్ దాడితో బ్రెయిన్‌డెడ్ కు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన మధిర సహన కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఈ రోజు.. ఆ కుటుంబానికి అందజేశారు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు..
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరమ్మతులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం గ్రామం పరవాడ జంక్షన్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఏర్పాటు కావాలి.. 5 ఏళ్లు గుంతలు తవ్వాడు.. రాష్ట్రానికి ప్రమాదమైన గోతులు తవ్వాడు.. నరకానికి కేరాఫ్ అడ్రస్ గా రాష్ట్ర రోడ్లు మార్చారు అని దుయ్యబట్టారు..