AP Government: వారికి గుడ్‌న్యూస్.. రూ.6,700 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం..
- 6,700 కోట్లు రుపాయిలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం..
- పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం నిధులు విడుదల..
- ఈ రోజు సాయంత్రంలోగా బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వివిధ వర్గాలకు రావాల్సిన బిల్లులకు సంబంధించి కొంతకాలంగా ఒత్తిడి వస్తోంది.. పలు వర్గాలకు గత కొంత కాలంలో పెండింగ్ లో ఉండి ప్రభుత్వం చెల్లించాల్సిన బాకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది.. .దాదాపు 8 ఏళ్లుగా కూడా కొన్ని బిల్లులు చెల్లింపులు జగన్ సర్కార్ పెండింగ్ లో పెట్టింది.. అలా పెండింగ్ లో ఉన్న బిల్లుల్లో 6,700 కోట్లు రుపాయిలు నిధులు విడుదల చేశారు.. ఇందులో పది లక్షల లోపు బిల్లులు, ఉద్యోగుల జీపీఎఫ్, పోలీసుల సరెండర్ లీవులు, విద్యార్దుల ఫీజు రియంబర్స్ మెంట్ లాంటివి ఉన్నాయి.. గత జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు లక్షా 20 వేల కోట్లు రుపాయిలు పెండింగ్ లో పెట్టింది.. 2014 – 19 మధ్యలో టీడీపీ పాలనలో పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదు.. అందులో చిన్ని చిన్న కాంట్రాక్టర్లు, చిన్న పరిశ్రమలకు చెల్లింపులు , విద్యార్ధుల ఫీజు రియంబర్స్ మెంట్ ఇలా అనేక మైన బిల్లులు పెండింగ్ లో పెట్టింది జగన్ సర్కార్.. అయితే రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కుటమి సర్కార్ కు పెండింగ్ బిల్లు చాలా పెను భారంగా మారింది.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్దిక ఇబ్బందుల్లో ఉంది.. దీనికి తోడు పెండింగ్ బిల్లులు చెల్లింపులు భారంగా మారింది.
Read Also: Allu Arjun: బన్నీ భారీ ప్రాజెక్ట్.. ఊహించని కాంబో లోడింగ్? (అల్లు అర్జున్)
Also Read
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
అయితే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పెండింగ్ బిల్లుల్లో.. పోలీసులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెండింగ్ బిల్లులు ఉన్నాయి.. ఉద్యోగుల జీపీఎఫ్ 519 కోట్లు నిధులు నేడు విడుదల చేశారు.. పోలీసుల రెండు సరెండర్ లీవులకు గాను.. ఒక ఇన్స్టాల్ మెంట్ బకాయి కింద 213 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేశారు.. మరో వైపు సీపీయస్ కింద 300 కోట్లు నిధులు విడుదల చేయగా. టీడీఎస్ కింద 265 కోట్లు చెల్లింపులు చేసింది ఆర్ధిక శాఖ.. మొత్తంగా ఉద్యోగులకు 1300 కోట్లు పెండింగ్ బిల్లులుకు నిధులు విడుదల చేశారు.. ఇదే క్రమంలో సుమారు 6.5 లక్షల మంది విద్యార్ధులకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రియంబర్స్ మెంట్ నిధులు 788 కోట్లు రుపాయిలు జమ కానున్నాయి..
Read Also: Allu Arjun: బన్నీ భారీ ప్రాజెక్ట్.. ఊహించని కాంబో లోడింగ్? (అల్లు అర్జున్)
సహజంగా ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్ల కు బిల్లులు చేయడం అనేది ప్రభుత్వం భాద్యత.. గత ఐదేళ్ల పాటు చెల్లించకుండా వేల కోట్లు పెండింగ్ ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.. ఇక, వాటిని ఇవాళ చెల్లిస్తున్న బిల్లులలో చిన్న, చిన్న ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసిన 26 వేల మందికి 10 లక్షల లోపు బిల్లులవి 586 కోట్లు నిధులు విడుదల చేశారు.. ఇదే క్రమంలో 650 చిన్న కంపెనీలకు గాను ప్రభుత్వ రాయితీలు కింద 90 కోట్లు విడుదల చేశారు.. రాష్ట్ర ప్రభుత్వ వివిధ వర్గాలకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ కింద 500 కోట్లు విడుదల చేశారు.. ఆరోగ్య శ్రీ బకాయిలు దాదాపు 3 వేల కోట్లు పెండింగ్ పెట్టింది.. దీనిలో విడతల వారికి ఇప్పటికే కొన్ని చెల్లింపులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ కు 400 కోట్లు చెల్లింపు చేసింది.. అమరావతి.. రైతులకు ఇచ్చే ఏడాది కౌలు పెండింగ్ బకాయిలను 241 కోట్లు రుపాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇవాళ సాయంత్రం లోగా 6700 కోట్లు రుపాయిలు పెండింగ్ బిల్లులు వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి..
తాజావార్తలు
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!