Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయంలో ధనుర్మాసంలో వచ్చిన ఆరుద్రా నక్షత్రం సందర్భంగా శ్రీస్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహించారు.. ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా, ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవంగా నిర్వహించడం దేవస్థానానికి ఆనవాయితీగా వస్తుంది. నిన్నరాత్రి శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం,అన్నాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన నిర్వహించి.. ఈ రోజు ఉదయం శ్రీస్వామివారి ప్రాతఃకాలపూజల అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీస్వామివారి ఆలయ ముఖమండపంలో ఉత్తరముఖంగా వేంచేబు చేయించి ప్రత్యేక పూజలు చేసి.. శివాజీగోపురంలో శ్రీస్వామి అమ్మవార్లను ఉత్తరముఖంగా వేంచేబు చేయించి నందివాహన సేవ జరిపి అనంతరం క్షేత్ర ప్రధాన విధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.
Read Also: Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు..
ప్రతీ ఉత్సవంలో మహాద్వారమైన నుంచి గ్రామోత్సవానికి తరలివెళ్లే శ్రీస్వామి అమ్మవార్లు సంవత్సరంలో రెండు సార్లు శివముక్కోటి, వార్షిక ఆరుద్రోత్సవం రోజులలో మాత్రమే ఉత్తరద్వారమైన శివాజీగోపురం నుంచి గ్రామోత్సవానికి తరలివెళ్లడం విశేషం.. గ్రామోత్సవం అనంతరం భక్తులకు శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు వీలుగా ఉత్తరం వైపున బలిపీఠం వద్ద వేంచేబు చేశారు. గ్రామోత్సవం ప్రారంభమైన వెంటనే భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ ఉత్సవంలో ఆలయ యువ శ్రీనివాసరావు పాల్గొన్నారు..
Read Also: Gold Rates Today : బంగారం కొనుగోలు దారులకు షాక్.. రూ.80వేలు క్రాస్ చేసిన పుత్తడి