Fake Notes in ATM: గుంటూరు జిల్లాలోని ఓ ఏటీఎంలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి.. తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో ఉన్న ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో దొంగ నోట్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. రెండు రోజుల క్రితం.. ఆ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేశాడు తాడేపల్లి మండలం పాతూరు గ్రామానికి చెందిన అంజిబాబు అనే ఇండియన్ బ్యాంకు ఖాతాదారుడు.. అయితే, డిపాజిట్ చేసిన నోట్లలో 18 వేల రూపాయల దొంగ నోట్లు ఉండడంతో అకౌంట్‌లో ఆ మొత్తం జమ కాలేదు.. ఇక, తాను 50,000 డిపాజిట్ చేయగా అందులో 18,000 డిపాజిట్ అవ్వలేదని బ్యాంకు మేనేజర్ కు సదరు ఖాతాదారుడు ఫిర్యాదు చేశాడు.. దీంతో.. దానిపై ఆరా తీశారు బ్యాంకు అధికారులు.. ఖాతాదారుడు జమ చేసిన సొమ్ములో 18 వేల రూపాయలు దొంగ నోట్లుగా గుర్తించారు.. ఆ తర్వాత దొంగ నోట్ల వ్యవహారంపై తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అసలు, అంజిబాబుకు దొంగనోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి..? ఆయనకు ఎవరు డబ్బులు ఇచ్చారు.. వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చాయి..? అనే కోణంలో విచారణ చేపట్టారు తాడేపల్లి పోలీసులు..
Read Also: Hussain Sagar: హుస్సేన్ సాగర్‌లో అగ్ని ప్రమాదం.. యువకుడు మిస్సింగ్!