Big Relief for YS Jagan: సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి భారీ ఊరట లభించింది.. వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ.. మరోవైపు జగన్ పై ఉన్న కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు గతంలో వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.. రఘురామ కృష్ణం రాజు పిటిషన్ పై విచారణ జరిపింది జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం.. చివరకు ఆ పిటిషన్‌ను డిస్మస్ చేస్తున్నట్టు వెల్లడించింది.. ఇక, జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ ను ఉపసoహరించుకున్నారు పిటిషనర్.. ఈ పరిణామాలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించినట్టు అయ్యింది.. ఇక, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..