Jail Superintendent Corruption: జైలు సూపరింటెండెంట్ అవినీతి బాగోతం.. ఒక్కొక్కటిగా వెలుగులోకి..!
- నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ అవినీతి బాగోతం..
- ఒక్కొక్కటిగా వెలుగులోకి అవినీతి, అక్రమాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jail Superintendent Corruption: నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.. జైలు సూపరింటెండెంట్ శ్రీరామ్ రాజారావు అవినీతి, అక్రమాలపై అధికారులు నోరువెల్లబెడుతున్నారు.. రిమాండ్ ఖైదీల తాలుకు బంధువుల నుంచి నగదు, మద్యం డిమాండ్ చేసిన ఫోన్ సంభాషణ మరువకముందే వెలుగులోకి మరో అవినీతి బాగోతం వచ్చింది.. గత ఏడాది గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసులో మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు కాశిని నెల్లూరు జిల్లా జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించింది న్యాయ స్థానం… అయితే, రిమాండ్ ఖైదీగా వచ్చిన కాశీని బాగా చూసుకునేందుకు, సకల సౌకర్యాలు కల్పించేందుకు ఉదయ్ అనే వ్యక్తి నుంచి 20 వేలు ఫోన్ పే వేయించుకున్నట్లు వెలుగులోకి వచ్చింది..
Read Also: Whatsapp View Once: వాట్సాప్ యూజర్లకు షాక్.. ‘View Once’ ఫీచర్‌లో పెద్ద లోపం..
Also Read
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
ఇక, ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న భాస్కర్ అనే ఖైదీ పెరోల్‌పై బయటకు రాగా.. మద్యం బాటిల్ తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేశాడట రాజారావు.. మద్యం బాటిల్ తీసుకుని తన ఇంటి వద్దకు రావాలని భాస్కర్‌ను వేధించిన జైలు సూపరంటెండెంట్ శ్రీరామ్ రాజారావు సంభాషణ ఆడియోటేపులు వెలుగులోకి వచ్చిన విషయం విదితమే.. అయితే, ఈ వ్యవహారాలపై విచారణ చేపట్టేందుకు రంగంలోకి దిగారు జైళ్ల శాఖ డీఐజీ.. భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ శ్రీరామ్ రాజారావుపై శాఖ పరమైన చర్యలు ఉంటాయా? లేక చేతులు తడుపుకుని తుడిచేసుకుంటారా?అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, హోం మంత్రి ఈ అవినీతి జైల్ సూపరింటెండెంట్‌పై ఎటువంటి చర్యలు తీసుకోనుంది అనేది ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!