గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది అనే అంశంపై శాసన మండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. వాస్తవాలు చెబితే మాకు అభ్యంతరం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. అయితే, చట్ట సభల పరిధిలోకి రాకుండా నిధులు ఖర్చుపెడితే ఎలా ఒప్పుకుంటాం అని నిలదీశారు మంత్రి పయ్యావుల కేశవ్.. నిధులను పక్కదారి పట్టించడం రాజ్యాంగ వ్యతిరేకంగా పేర్కొన్నారు..
ఒక ఉద్ధానంలోనే కాదు.. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో కిడ్నీ బాధితులు ఉన్నారని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ కు కమిటెడ్ లీడర్ షిప్ కావాలన్నారు.. కిడ్నీ బాధితులు ఒక్క ఉద్ధానంలోనే కాదు రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో ఉన్నారు.. కలుషిత నీరు తాగి కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పెరిగారంటూ ఆందోళన వ్యక్తం చేశారు..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఇప్పటికే క్వాష్ పిటిషన్ విషయంలో ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురైన విషయం విదితమే కాగా.. అయితే, ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. ఒంగోలు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు..
ఎన్టీఆర్ జిల్లాలో మిస్టరీగా మారింది వీఆర్వో అశోక్ మిస్సింగ్ వ్యవహారం.. రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు ఇబ్రహీంపట్నం వీఆర్వో అశోక్.. ఇబ్రాహీంపట్నం తహసీల్దార్, ఆర్ఐ తనను వేధింపులకు గురిచేస్తున్నారని.. వారి ఇబ్బందులు తట్టుకోలేక.. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఉద్యోగుల గ్రూప్ లో మెసేజ్ పెట్టిన అశోక్.. ఆ తర్వాత అదృశ్యమయ్యారు..
తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. చలితో ప్రజలు వణికిపోతున్నారు.. ఇక, అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి వణుకు పుట్టిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోయాయి. ఏజెన్సీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కురుస్తుంది. మినుములూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా.. పాడేరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన పొగమంచు, శీతల గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది.. సాయంత్రం 4గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. రూ.85 వేల కోట్ల పెట్టుబడులపై ఎస్ఐపీబీ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతికి సంబంధించి గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుకు ఈ కేబినెట్లో ఆమోదం తెలుపనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచిస్తోంది.. ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా వాయుగుండంగా బలపడొచ్చని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇది తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు కదిలే అవకాశముంది. దీని ప్రభావంతో ఈ నెల 26 తర్వాత దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలో పంచాయతీరాజ్ బిల్లును ప్రవేశపెట్టారు.. ఆశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. గ్రామాల్లో పరిశుభ్రత అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. అయితే, డంపింగ్ యార్డ్ సమస్య ప్రధానంగా మారిందన్నారు.. దీని కోసం మండలం యూనిట్‌గా డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటు చేస్తున్నాం అని వివరించారు.. ఇక, 2019-24 మధ్య పంచాయతీ భవనాలకు రంగులు వేయడానికి రూ.104.81 కోట్లు ఖర్చు చేశారని దుయ్యబట్టారు పవన్ కల్యాణ్..